ప్రభుత్వానికి అధికార నియంత్రణ ఆపరేషన్ చేయాలి

సూర్యాపేట జిల్లా:"పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్" చేసి నలుగురు మహిళల చావుకు టీఆర్ఎస్ ఏ విధంగా కారణమైందో అదే విధంగా రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి "ఓట్లు పుట్టకుండా బహుజనుల అంతా ఏకమై అధికార నియంత్రణ ఆపరేషన్" చేసి సమాధి చేయాల్సిన సమయం ఆసన్నమైందని బహుజన సమాజ్ పార్టీ కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు గుండెపంగు రమేష్ పిలుపునిచ్చారు.

ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చనిపోయిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బీఎస్పీ అధ్యక్షులు డాక్టర్ ఆర్.

ఎస్.ప్రవీణ్ కుమార్ పిలుపు మేరకు కోదాడ నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కోదాడ పట్టణంలోని రంగా థీయేటర్ సెంటర్ లో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.

నిరసనకారులను కోదాడ పట్టణ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

ఈ సందర్భంగా గుండెపంగు రమేష్ మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ ఆపేరేషన్స్ వికటించి నలుగురు మహిళలు మృత్యువాత పడ్డారని,ఇంకా కొంతమంది మహిళలు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ మరణాలు సభవించాయని ఆరోపించారు.దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలని,లేకుంటే ముఖ్యమంత్రి వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్యం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకొనే ప్రభుత్వం ఈ మరణాలకు సమాధానం చెప్పాలని,లేకుంటే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి దాసరి జైసూర్య,మహిళా జిల్లా కన్వీనర్ నాగమణి,కోదాడ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మామిడి రవికుమార్ గౌడ్,మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు నాగమణి,బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ నాయకులు కుడుముల నిర్మల, ప్రియాంక,కోదాడ పట్టణ ఇంచార్జి కంపాటి శ్రవణ్ కుమార్,అనంతగిరి మండల అధ్యక్షులు ఇర్మియ, మునగాల మండల నాయకులు కత్తి నాగబాబు, చిలుకూరు మండల నాయకులు నాగయ్య,చిరంజీవి, సోషల్ మీడియా ఇంచార్జ్ కర్ల ప్రేమ్,కుడుముల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

టార్గెట్ జగన్… పులివెందుల నుంచే మొదలుపెట్టిన బాబు