ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్

ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ నుంచి చీఫ్ సెక్రటరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఘటనపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.

అయితే రిమ్స్ ఆస్పత్రి వద్ద అర్ధరాత్రి సమయంలో మెడికోలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.

ఈ దాడిలో ఇద్దరు వైద్య విద్యార్థులు గాయపడ్డారు.దీంతో మెడికోలు ఆస్పత్రి వద్ద బైఠాయించి నిరసనకు దిగారు.

అనంతరం రిమ్స్ డైరెక్టర్ తో పాటు అసోసియేటెడ్ ప్రొఫెసర్ ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

వైరల్: జలుబు చేసిందని ఇంగ్లీషులో యజమానికి చెబుతున్న చిలుక!