కోనసీమ వార్ : రంగంలోకి సీనియర్ ఐపీఎస్ లు 

ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లా ఇప్పుడు ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది.తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఈ కోనసీమ ప్రాంతాన్ని మొదటగా కోనసీమ జిల్లాగా ప్రకటించారు.

ఆ తరువాత అంబేద్కర్ జిల్లాగా మార్చాలి అని పెద్ద ఎత్తున ఆందోళన చోటుచేసుకోవడం, ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు రావడం తదితర కారణాలతో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది .

అక్కడి నుంచి ఈ పేరు మార్పు నిరసిస్తూ ఆందోళనలు మొదలయ్యాయి.  కోనసీమ జిల్లా గానే ఉంచాలని అంబేద్కర్ పేరును చేర్చేందుకు వీల్లేదంటూ వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు మొదలయ్యాయి .

  కోనసీమ జిల్లా సాధన సమితి పేరుతో ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.ఈ ఆందోళనలు కాస్త మరింత ఉధృతమై ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ , ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసాలను దహనం చేసే వరకు పరిస్థితి వెళ్లింది.

అమలాపురం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, చలో రావులపాలెం కార్యక్రమానికి అమలాపురం సాధన సమితి పిలుపునివ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది .

మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా నివారించేందుకు సీనియర్ ఐపిఎస్ అధికారులను రంగంలోకి దింపింది.

కోనసీమ జిల్లాలోని సున్నితమైన ప్రాంతాలకు ఎస్పీలను ఇన్చార్జిగా నియమించింది.ప్రాంతాలను విభజించి 144 సెక్షన్ అమలును పర్యవేక్షిస్తున్నారు.

కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఏపీఎస్పీ , ఏఆర్ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు.

కోనసీమ ప్రాంతంలో ఎక్కడ ఉద్రిక్తత ఏర్పడకుండా ఐపిఎస్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  """/"/    శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు అమలాపురం లో ఎటువంటి వ్యాపార వ్యవహారాలు తెరుచుకోలేదు మెడికల్ , నిత్యావసరాలు అన్నిటినీ మూసివేశారు.

మరిన్ని అల్లర్లు కోనసీమ ప్రాంతంలో చోటుచేసుకునే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ముందస్తుగా అరెస్టు చేసే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.ఈరోజు కోనసీమ సాధన సమితి పిలుపు నిచ్చిన చలో రాయలసీమ కార్యక్రమం జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.

మరి కొన్ని రోజుల పాటు ఇదే రకమైన చర్యలు చేపట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వస్తున్న సూచనలను పాటిస్తూ పరిస్థితిని అదుపులోకి  తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ లిస్ట్‌లో నార్త్ డకోటా గవర్నర్ .. అమెరికన్ మీడియాలో కథనాలు