గుడ్ న్యూస్: మళ్లీ రైతుల అకౌంట్లోకి డబ్బులు వేయనున్న కేంద్ర సర్కార్..!

భారత కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు పీఎం కిసాన్ యోజన కింద ఎనిమిదో విడత డబ్బులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

ఇది రైతులకు మంచి శుభవార్త గా అభివర్ణించవచ్చు.అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఏడో విడత డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.ప్రస్తుతం 8వ విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

ఈనెల చివరి వారం లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు పడే అవకాశం ఉంది.

అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒకేసారి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకుండా మూడు విడతల్లో జమ చేయనుంది.

అనగా ఒక్కో విడత కి రూ.2 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం అన్నదాతల బ్యాంక్ ఖాతాలకు డబ్బు జమ చేయనున్నది.

పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా భారత దేశ వ్యాప్తంగా 11 కోట్ల 27 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు.

అయితే ఈ స్కీమ్ లో చేరని రైతులు ఇప్పుడు కూడా చేరే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది.

ఈ స్కీమ్ లో చేరి కూడా డబ్బులు రాకపోతే ఆ రైతులు తమ అప్లికేషన్ లో పొరపాటు ఏమైనా జరిగిందో సరిచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇందుకోసం అప్లికేషన్ స్టేటస్ చెక్ చేస్తే సరిపోతుంది. """/"/ అయితే అప్లికేషన్ ఎడిట్ చేసుకునేందుకు ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు.

ఇంట్లోనే ఉండి పీఎం కిసాన్ యోజన వెబ్సైట్ ను సందర్శించి సులభంగా తెలుసుకోవచ్చు.

పీఎం కిసాన్ యోజన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ పై క్లిక్ చేసి బెనిఫిషరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి.

అనంతరం మీకు ఒక కొత్త పేజీ కనిపిస్తుంది.ఆ పేజీలో మీ ఆధార్ కార్డు నెంబర్ గానీ ఫోన్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తే మీ స్టేటస్ వివరాలు ప్రత్యక్షమవుతాయి.

అలాగే కొత్తవారు ఇదే వెబ్ సైట్ ను సందర్శించి ఈ స్కీం లో జాయిన్ అయ్యి ప్రతి ఏడాది లబ్ది పొందండి.

ఏపీ సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్..!!