కొత్త కారు కొనుగోలు చేసి ట్రోల్ అవుతున్న ది గోట్ డైరెక్టర్.. అసలేం జరిగిందంటే?
TeluguStop.com
వినాయక చవితి పండుగ( Vinayaka Chavithi Festival ) కానుకగా థియేటర్లలో విడుదలైన ది గోట్ మూవీ ( The Goat Movie )ప్రేక్షకులను మెప్పించలేదనే సంగతి తెలిసిందే.
ఈ సినిమా విషయంలో దర్శకుడు వెంకట్ ప్రభుపై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.
స్టార్ హీరో విజయ్ ఛాన్స్ ఇస్తే వెంకట్ ప్రభు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అయితే తాజాగా కొత్త కారును కొనుగోలు చేసి డైరెక్టర్ వెంకట్ ప్రభు( Director Venkat Prabhu ) ట్రోల్స్ కు గురవుతున్నారు.
తమిళనాడు రాష్ట్రంలో ది గోట్ సినిమాకు అంతో ఇంతో కలెక్షన్లు వచ్చినా ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది.
వెంకట్ ప్రభు ఏకంగా 80 లక్షల రూపాయలు ఖర్చు చేసి కొత్త కారును కొనుగోలు చేశారు.
వెంకట్ ప్రభు విజయ్ కు ఫ్లాప్ ఇచ్చి కొత్త కారును కొనుగోలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలోని డిజాస్టర్లలో ఈ సినిమా ఒకటి కావడం గమనార్హం. """/" /
మరోవైపు విజయ్ చివరి సినిమాకు సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడింది.
మరోవైపు విజయ్ 69వ మూవీ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ( KVN Productions Banner
)లో హెచ్.
వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది.ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.
విజయ్ చివరి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని అభిమానులు ఫీలవుతున్నారు. """/" /
వెంకట్ ప్రభుకు కొత్త మూవీ ఆఫర్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.
వెంకట్ ప్రభు వరుస ఫ్లాపుల వల్ల తనపై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నారు.
ది గోట్ సినిమా రిజల్ట్ గురించి వెంకట్ ప్రభు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
ది గోట్ నష్టాల లెక్క ఒకింత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.
విజయ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
లవంగాల పాలు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రోజూ తాగేస్తారు..!