రైతు ఇబ్బంది పడొద్దన్నదే వైసీపీ సర్కార్ లక్ష్యం.. సీఎం జగన్

అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా కల్యాణదుర్గంలో వైఎస్ఆర్ రైతు దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడొద్దన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ తెలిపారు.

ఎనిమిది జిల్లాల్లో చిరుధాన్యాలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టామన్నారు.చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నామన్న సీఎం జగన్ చుక్కల భూములకు సంపూర్ణ హక్కు కల్పించామని పేర్కొన్నారు.

రైతుల ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.పశువుల కోసం కూడా అంబులెన్స్ లు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో రైతులకు ఉపయోగపడే ఆర్థిక వ్యవస్థ కావాలా లేదా రైతులను ఇబ్బంది పెట్టే దళారీ వ్యవస్థ కావాలా అని జగన్ ప్రశ్నించారు.

షెల్టర్ హోమ్ నుంచి బాలికను అపహరించిన ఆరుగురు వ్యక్తులు.. వీడియో వైరల్..