ట్విట్టర్ లో నయా ట్రెండ్.. గో బ్యాక్ స్టాలిన్ అంటూ హాష్ ట్యాగ్.. ఎందుకంటే..??
TeluguStop.com
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే పార్టీ విజయం సాధించడంతో మే 2న స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
పదవి చేపట్టిన దగ్గర నుండి ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తూ వారి మనస్సులో ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఆయన పాలనతో పాటు, వివిధ రకాల పథకాలను అమలుచేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.
అలాగే ఈ మధ్యకాలంలో ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ నేషన్ సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో తమిళనాడు సీఎం స్టాలిన్ నంబర్ వన్‌గా నిలిచి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేరుస్తూ తమిళనాడు రాష్ట్రంలో తన మార్క్ ఉండేలా సీఎం స్టాలిన్ జాగ్రత్తలు వహిస్తున్నారు.
ఆయన ముఖ్యమంత్రి అయి సుమారుగా ఆరు నెలలే గానీ ఇప్పటివరకు స్టాలిన్ పై ఎలాంటి విమర్శలు రాలేదు.
కానీ ఇప్పుడు మాత్రం తమిళనాడులోని ప్రజలు ముఖ్యమంత్రి స్టాలిన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రంలో సీఎం స్టాలిన్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు.కానీ ఇప్పుడు మాత్రం ఆయనపై ప్రజలలో నెగిటివిటీ ఏర్పడుతోంది.
ఏ విషయంలో అని అనుకుంటున్నారా.తమిళనాడుని ప్రతి సంవత్సరం వరదలు ముంచెత్తుతూనే ఉంటాయి.
ఈ క్రమంలోనే ఈసారి కూడా స్టాలిన్ వరద ప్రాంత ప్రజలకు దగ్గర ఉండి మరి సహాయ చర్యలు చేపట్టారు.
ప్రజల ఇంటికి వెళ్లి మరి వారి యోగక్షేమాలు తెలుసుకుని వారిని పరామర్శించారు.కానీ స్టాలిన్ అందరిని పట్టించుకోలేదని, చాలామంది ప్రజలను పట్టించుకోలేదని వాపోతున్నారు.
"""/"/
స్టాలిన్ ప్రభుత్వం వరద సమయంలో వారిని ఆదుకునే విషయంలో ఘోరంగా విఫలం అయిందని వాపోతున్నారు.