ఈ 'బేబీ ఇండియా'ను ప్రపంచం అంతా కోరుకుంటున్నారు.. ఈ చిన్నారి ప్రత్యేకత ఏంటో తెలుసా

కొన్ని రోజుల క్రితం అమెరికాలో ప్లాస్టిక్‌ సంచిలో దొరికిన శిశువు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతుంది.

ఈ అందమైన శిషువును గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్‌ సంచిలో ఉంచి చెత్త కుప్పలో పడవేశారు.

ఈ విషయం సోసల్‌ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం తెలిసింది.దాంతో ఈ బేబీ గురించిన విషయాలను తెలుసుకునేందుకు అంతా ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఈ బేబీకి 'ఇండియా' అనే పేరు పెట్టడం జరిగింది.ప్రస్తుతం చైల్డ్‌ కేర్‌ సెంటర్‌లో సంరక్షించబడుతున్న ఈ బేబీ ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

"""/"/ బేబీ ఇండియాకు పర్మినెంట్‌ అడ్రస్‌ను కల్పించేందుకు బేబీ కేర్‌ సెంటర్‌ వారు ప్రయత్నిస్తున్నారు.

అందుకోసం ఎవరైనా ఈ బేబీని దత్తత తీసుకుంటారా అంటూ వారు ప్రశ్నించారు.దాంతో అమెరికా నుండే కాకుండా దేశ విదేశాల నుండి కూడా ఈ బేబీని దత్తత తీసుకునేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.

వందల కోట్ల ఆస్తులు ఉన్న వారు ఎంతో మంది ఈ బేబీపై ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ బేబీ ప్రత్యేకత ఏమీ లేకపోయినా కూడా తమకు కావాలంటూ అంత మంది కోరడం అధికారులను ఆశ్చర్యపర్చుతోంది.

చైల్డ్‌ కేర్‌ సెంటర్‌ నుండి మరి కొన్ని రోజుల్లోనే బేబీని దత్తత ఇచ్చే అవకాశం ఉంది.

ఆ బేబీ గురించి సోషల్‌ మీడియాలో విపరీతమైన ప్రచారం జరగడంతో పాటు చాలా అందంగా ఉండటం మరియు ఆ బేబీ ఆరోగ్య పరిస్థితి చాలా బాగుందని, ఆమె చాలా గట్టి పిండం అంటూ డాక్టర్లు కితాబు ఇవ్వడమే ఆమె ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

అందుకే చాలా మంది తమకు బేబీ ఇండియా కావాలని పట్టుబడుతున్నారు.అయితే అమెరికన్స్‌కు మాత్రమే దత్తత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

"""/"/ ఇంతకు చెత్త కుప్పలో దొరికిన ఈ బేబీకి 'ఇండియా' అంటూ పేరు ఎందుకు పెట్టారో మాత్రం అర్థం కావడం లేదు.

ఈ విషయమై ఇండియన్స్‌ కొందరు అసహనం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం గొప్పగా ఫీల్‌ అవ్వాల్సిన విషయం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

క్యాండీ క్రష్ గేమ్ కోసం రూ.30 లక్షల చర్చి నిధులు వాడేసిన పాస్టర్‌..??