ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం త్వరగా చేపట్టాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల పంపిణీ( Fish Distribution Scheme ) ప్రతి సంవత్సరం అందించినట్లు ఈ సంవత్సరమునకు గాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7000 పైగా సొసైటీలకు ఉచిత చేప పిల్లల పంపిణీ చేయలి.

ఏప్రిల్ మే నెలలో ఆన్లైన్లో టెండర్ల నోటిఫికేషన్ వచ్చి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసుకుని ఆగస్టు నెలలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మొదలుకొని డిసెంబర్ చివరికల్లా తెలంగాణ రాష్ట్రంలో అన్ని చెరువులు కుంటల్లో రిజర్వాయర్లలో చేప పిల్లలను వదలడం జరిగింది.

దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల( Rajanna Sirisilla )కు చెందిన మూడు రిజర్వాయర్లు మిడ్ మానేర్ అనంతగిరి అప్పర్ మానేరు మరియు 440 చెరువులలో చేప పిల్లలు వదలాల్సి ఉంది, దీనికి గాను కోటి నలభై లక్షల చేప పిల్లలను తెలంగాణ ప్రభుత్వం వదలాల్సి ఉంది దానితో మత్స్యకారులకు చాలా ఉపయోగకరంగా జీవనోపాధి కలుగుతుంది.

ఈ సంవత్సరం కూడా త్వరగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టి అందజేయాలని మత్స్యకారులు ప్రభుత్వం కోరడం జరుగుతుంది.

డ్రైవింగ్ చేస్తూ ఇదేం పని.. ఇంటికెళ్లి చేసుకో.. టేస్టీ తేజ పై ఆగ్రహం వ్యక్తం చేసిన నేటిజన్స్!