రైస్ మిల్లు యాజమాన్యం తో చర్చలు జరిపిన మాజీ ఎంపీటీసీ
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల కిషన్ దాస్ పేట( Kishan Das Peta ) లో సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల క్వింటాళ్ల వరి ధాన్యం ను ఇదే మండలంలోని పదిర గ్రామములో గల లలితా పరమేశ్వరి ఇండస్ట్రీస్(Lalitha Parameshwari Industries ) వారిని కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగ ఈ మేరకు మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu Balraj Yadav ) రైస్ మిల్లు యాజమాన్యం తో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా రైస్ మిల్లు యాజమాన్యం బాలరాజు యాదవ్ తో మాట్లాడుతూ తాలు పొల్లు లేకుండా వడ్లు ఎగబోసి తీసుకు వస్తె 41కిలోలు కాంట పెట్టుకుంటామని,వడ్లు ఎగబోయకుండ నేరుగా వడ్లు మిల్లు కు తీసుకువస్తే 42కిలోల 500గ్రాముల తూకం పెట్టుకుని తాము తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వడ్లు తాలు,పొల్లు లేకుండానే తీసుకురావాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిందనీ మిల్లు యాజమాన్యం పేర్కొంది.
కాగ వడ్లు జాలీ పట్టకుండా తీసుకువస్తే 42 కిలోల 500 గ్రాముల ను తూకం వేస్తామని చెప్పగా బయట వేరే మండలాల్లో 42కిలోల 200 గ్రాముల వడ్లు తూకం చొప్పున తీసుకుంటామని రైస్ మిల్లు యాజమాన్యం పేర్కొంది.
బాలరాజు యాదవ్ వెంట కిష్టం పల్లి సింగిల్ విండో సెంటర్ నిర్వాహకులు గుండం సత్యారెడ్డి,సాన రాజు ఉన్నారు.
How Modern Technology Shapes The IGaming Experience