ఏ దేవుడికి ఏ పువ్వు ఎందుకు అంత ప్రీతీకరమో తెలుసా?
TeluguStop.com
సాధారణంగా కొన్ని రకాల పుష్పాలతో కొందరి దేవుళ్ళను పూజిస్తే వారు ప్రీతి చెంది స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తాము.
ఈ క్రమంలోనే కొందరి దేవ దేవతలకు ప్రత్యేకించి కొన్ని రకాల పుష్పాలతో పూజిస్తాము.
అయితే ఆ పుష్పాలు ఆ దేవుడికి ఎందుకు అంత ప్రీతికరం అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
కాళీ మాతకు ఎర్రమందారం అంటే ఎంతో ప్రీతికరం.ఎర్ర మందారాలతో అమ్మ వారిని పూజించడం వల్ల అమ్మవారి కరుణాకటాక్షాలు మనపై ఉంటాయి.
అయితే అమ్మవారికి ఎర్రమందారం ఎందుకంత ఇష్టం అనే విషయానికి వస్తే.కాళీ మాత నాలుక ఎప్పుడు ఎరుపు రంగులో ఉంటుంది కనుక అమ్మవారి నాలుకకు గుర్తుగా కాళీ మాతకు ఎరుపురంగు మందారాలతో పూజ చేస్తారు.
ఈ క్రమంలోనే కొందరు భక్తులు 108 ఎర్ర మందారాలను మాలగా కూర్చి అమ్మవారికి సమర్పిస్తారు.
ఇలా చేయటం వల్ల అమ్మవారు ఎంతో సంతోషిస్తారని భక్తులు విశ్వసిస్తారు. """/" /
విష్ణు దేవుడికి పారిజాత పుష్పాలు అంటే ఎంతో ప్రీతికరం.
సాగర మధనం చేస్తున్న సమయంలో సముద్రగర్భం నుంచి ఎన్నో వస్తువులు ఉద్భవించాయి.అలా ఉద్భవించిన వాటిలో పారిజాత వృక్షం ఒకటి.
ఇల సముద్ర గర్భం నుంచి వచ్చిన పారిజాత వృక్షాన్ని విష్ణుదేవుడు స్వర్గానికి తీసుకువెళ్లగా స్వర్గం మొత్తం సువాసనలు వెదజల్లిందని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే విష్ణు దేవుడికి పారిజాత పుష్పాలతో పూజిస్తే ఎంతో శుభం కలుగుతుంది. """/" /
వినాయకుడికి బంతి పువ్వు అంటే ఎంతో ప్రీతికరం.
బంతి పువ్వు ఎప్పుడూ కూడా ప్రతికూల పరిస్థితులను తొలగించి సానుకూలతను పెంచుతుంది.అందుకే ఏదైనా శుభకార్యాలలో బంతి పూలను అలంకరణ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఇక సృజనాత్మకతకు మారుపేరు అయిన గోగి పువ్వు సరస్వతి దేవికి ఎంతో ప్రీతికరం.
జ్ఞానానికి తెలివికి ప్రతీకగా నిలిచే ఈ పుష్పాలను సరస్వతీదేవికి సమర్పించడంవల్ల సరస్వతి దేవి తెలివితేటలను జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని భావిస్తారు.
ఎక్స్ లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ సమంత.. తొలి పోస్ట్ ఏంటో తెలుసా?