చేతులు  ఎత్తేసిన ఐదుగురు మంత్రులు.. పెద్ద `పంచాయ‌తీ`నే !

చేతులు  ఎత్తేసిన ఐదుగురు మంత్రులు పెద్ద `పంచాయ‌తీ`నే !

తాజాగా ముగిసిన నాలుగు విడ‌త‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీ కీల‌క నేత‌లు, మంత్రులు కొన్ని చోట్ల  చ‌తికిల ప‌డ్డారు.

చేతులు  ఎత్తేసిన ఐదుగురు మంత్రులు పెద్ద `పంచాయ‌తీ`నే !

భారీ ఎత్తున పంచాయ‌తీల్లో విజ‌యం సాధించామ‌ని చెప్పుకొంటున్నా.అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మాత్రం.

చేతులు  ఎత్తేసిన ఐదుగురు మంత్రులు పెద్ద `పంచాయ‌తీ`నే !

ఐదుగురు మంత్రులు విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.వీరిపై పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ వారిపై పెట్టుకున్న ఆశ‌లు నీరుగారాయ‌ని సీనియ‌ర్లు గుస‌గుస‌లాడుతున్నారు.

వీరు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పంచాయ‌తీ ల‌ను గుండుగుత్తుగా ఏక‌గ్రీవం చేసుకుంటార‌ని అంద‌రూ భావించారు.

ముఖ్యంగా పార్టీ అధినేత జ‌గ‌న్ ఆయా నేత‌లపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.కానీ, నాలుగు విడ‌త‌లు ముగిసే స‌రికి మాత్రం ఐదుగురు మంత్రులు ఫెయిల‌య్యారు.

కొడాలి నాని: """/"/ జ‌గ‌న్ కేబినెట్‌లో కీల‌క మంత్రి.క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో టీడీపీని టార్గెట్ చేసేందుకు ఈయ‌న‌ను ఎక్కువ‌గా వాడుతున్నారు.

అలాంటి నాని.తాజా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో స‌త్తా చూపించ‌లేక‌పోయారు.

మంత్రి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ మెరుగుప‌డింద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.అదే స‌మ‌యంలో మంత్రిగారి సొంత ఇలాకాలోనూ వైసీపీకి మ‌రీ అంత వ‌న్‌సైడ్ విజ‌యం ద‌క్క‌లేదు.

పినిపే విశ్వ‌రూప్‌:   """/"/ తూర్పుగోదావ‌రి జిల్లాలోని అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఈయ‌న కూడా విఫ‌ల‌మ‌య్యారు.

మంత్రిగా సైలెంట్‌గా ఉన్న‌ప్ప‌టికీ.పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స‌త్తా చూపుతార‌ని అంద‌రూ అనుకున్నారు.

అయితే.చిత్రంగా ఈయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన బ‌ల‌ప‌డింది.

సీదిరి అప్ప‌ల‌రాజు:   """/"/ శ్రీకాకుళం జిల్లా ప‌లాస  నుంచి ఎన్నికై. మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టిన సీదిరి అప్ప‌ల‌రాజు స్థానికంలో ప‌ట్టు సంపాయించలేక పోయారు.

ఇక్క‌డ కూడా టీడీపీ మెరుగైన విధంగానే పుంజుకుంది.తానేటి వ‌నిత‌: """/"/ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరులో మ‌ంత్రి వ‌నిత పూర్తిగా చేతులు ఎత్తేశారు.

టీడీపీ కి ప‌ట్టున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పంచాయ‌తీల‌ను ఆ పార్టీనే కైవ‌సం చేసుకుంది.

ముందు మంత్రి హ‌డావుడి చేసినా.త‌ర్వాత మాత్రం ప‌లితం రివ‌ర్స్ అయింది.

టీడీపీ ఇక్క‌డ గ‌ట్టి పోటీ ఇచ్చింది.దీంతో ఇప్పుడు వీరిపై చ‌ర్య‌లు ఉంటాయా.

లేక క్లాస్ తీసుకుని వ‌దిలేస్తారా? అనేది ఆస‌క్తిగా మారింది.ఏం చేస్తారో చూడాలి.