తెలంగాణాలో తొలి 'విస్టాడోమ్ కోచ్‌' ట్రైన్.. ప్రయాణికులకు నచ్చిన ట్రైన్ ఇదే!

'విస్టాడోమ్ కోచ్‌' ట్రైన్ గురించి వేనే వుంటారు.దక్షిణ మధ్య రైల్వేలో ఈమధ్య విస్టాడోమ్ కోచ్‌ ఓ సంచలనం సృష్టించింది.

రైల్వే ప్రయాణికుల మనసుని దోచుకుంది.'విస్టాడోమ్ కోచ్‌'తో నడిచే మొట్టమొదటి రైలు సికింద్రాబాద్, పూణే మధ్య ప్రయాణించే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ను బుధవారం 10వ తేదిన ప్రారంభించారు.

దీంతో ప్రయాణీకుల నుంచి భారీ స్పందన లభిస్తోందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.

కోవిడ్ సమయంలో సికింద్రాబాద్, పూణే మధ్య నడిచే ఈ శతాబ్ధి ఎక్స్ ప్రెస్‌ను నిలిపివేసారని, బుధవారం తిరిగి ప్రారంభించి దానికి విస్టా డోమ్ కోచ్‌‌ను కొత్తగా చేర్చారని పేర్కొన్నారు.

LHB (లింక్ హఫ్మాన్ బుష్) కోచ్‌లతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ రైలుకు విస్టాడోమ్ కోచ్‌ను చేర్చడం అదనపు ఆకర్షణగా మారిందని చెప్పుకొచ్చారు.

దీనికి వున్న ప్రత్యేకత ఏమంటే, పెద్ద పెద్ద గాజు కిటికీలు.అవును.

ఈ కోచ్ పై కప్పు కూడా గాజుతో చేసిందని, అందువల్ల ఈ కోచ్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికులు సికింద్రాబాద్ - పూణే - సికింద్రాబాద్ మార్గంలో తమ చుట్టూ ఉన్న పరిసరాలను అంటే ప్రకృతి అందాలను చూస్తూ ప్రయాణం బాగా ఎంజాయ్ చేస్తున్నారని వివరించారు.

ముఖ్యంగా మార్గం మధ్యలో వికారాబాద్ దగ్గర ఉన్న అనంతగిరి హిల్స్, బిగ్వాన్ దగ్గరి డ్యామును బాగా ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు.

ఈ ప్రాంతం దేశీయ, వలస పక్షులకు నెలవుగా వుంది.ఇందులో ప్రయాణికులు తాము కూర్చున్న చోటు నుంచి కదలకుండా చుట్టూ ఉన్న పరిసరాలను చూడవచ్చు.

ఈ రైలులో ఒక విస్టా డోమ్ కోచ్, రెండు ఎగ్జిక్యూటివ్ తరగతి కోచ్‌లు, తొమ్మిది ఏ‌సీ చైర్ కార్ కోచ్‌లు ఉంటాయి.

సికింద్రాబాద్ నుంచి పూణే‌కు విస్టా డోమ్ కోచ్‌లో ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ 2,110 చార్జ్ చేస్తారు.

నారా భువనేశ్వరి పై డిప్యూటీ సీఎం కొట్టు ఫైర్