బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ

తెలుగు వారికి కొత్త సంవత్సరం వసంత ఋతువు, చైత్ర మాసంలోని పాడ్యమి రోజునుంచి ప్రారంభమవుతుంది.

ఈరోజుని ఉగాది పర్వదినంగా హిందువులు జరుపుకుంటారు.అసలు ఈ ఉగాదికి తెలుగు సంవత్సరాలకి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి.

చైత్ర శుక్ల పాడ్యమి రోజున సృష్టి ప్రారంభమైందని పురాణాల కథనం.అందుకే చైత్రమాసంలోని శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాదిగా నిర్ణయిస్తారు.

ఉగ అంటే నక్షత్ర గమనం.దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం.

తెలుగు సంవత్సరాలు 60.బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ.

తెలుగు సంవ‌త్సరాల వెనుక పురాణాల్లో ఒక కథ ఉంది.బ్రహ్మ మానస పుత్రుడు నారద మహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి.

రాజును పెళ్లాడాడు.ఈ దంపతులకు 60 మంది పిల్లలు పుట్టారు.

ఆ రాజు తన సంతానంతో కలిసి ఓ యుద్ధంలో పాల్గొంటే.అప్పుడు ఆ యుద్ధంలో 60 మంది మరణిస్తారు.

తన పిల్లలు మరణాన్ని తట్టుకోలేని స్త్రీ రూపంలో ఉన్న నారదుడు విష్ణువుని ప్రార్ధించగా విష్ణువు కరుణించి.

నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిచ్చాడట.అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయని పౌరాణిక కథనం.

కృత త్రేతా ద్వాపర యుగాలకంటే మానవ ఆయుర్ధాయం పడిపోయి కేవలం 120 సంవత్సరాలకు వచ్చిందట.

అందుకే 60 ఏళ్ళు పూర్తవగానే సగం జీవితం పూర్తయ్యిందని గుర్తుచేస్తూ లోక సంభంద విషయాలు పూర్తిచేసుకొమ్మని షష్టిపూర్తి ఉత్సవంగా చేస్తారు.

అంటే మిగిలిన 60 ఏళ్లు తరువాతి తరాలకు మార్గదర్శకం చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో బ్రతకాలని చెప్పకనే చెప్తున్నారన్నమాట.

జూలైలో పెరిగిన ఎన్ఆర్ఐల డిపాజిట్స్.. ఎన్ని మిలియన్ డాలర్లంటే!!