రాష్ట్రంలో మొదటి మొబైల్ సినిమా ధియేటర్!

ఇది ట్రక్కులో ఎక్కడికైనా తీసుకుపోయి అమర్చుకోగల మొబైల్ సినిమా హాల్ .రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ ధియేటర్ ఏర్పాటౌతోంది.

వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్ లో గాలినింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఎసి ధియేటర్ ను రూపొందిస్తున్నారు.

“పిక్చర్ డిజిటల్స్” సంస్ధ ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్లలో ఇది మొదటిదని,ఆచార్య సినిమాతో ధియేటర్ ప్రారంభం కాగలదని సంస్ధ ప్రతినిధి చెప్పారు.

ఆచార్య సినిమాతో ఈ హాల్ ప్రారంభమౌతుందని ఆన్నారు.ఇది ఒకప్పటి టూరింగ్ టాకీసులకు ఆధునికమైన, సౌకర్యవంతమైన రూపం.

తూర్పుగోదావరి జిల్లాలో మోబైల్ సినిమా థియేటర్ రూపుదిద్దుకుంటోంది.ఏపిలో తొలి థియేటర్ జిల్లాలోని రాజానగరంలో ఏర్పాటవుతోంది.

సుమారు 120 మంది ప్రేక్షకులు సినిమా వీక్షించేలా నిర్వాహకులు ఈ థియేటర్ ను ముస్తాబు చేస్తున్నారు.

దిల్లీకి చెందిన పిక్చర్ డిజిటల్ సంస్థ అధునిక టెక్నాలజీతో పాతతరం టూరింగ్ టాకీస్ ల తరహాలో మోబైల్ సినిమా థియేటర్ ను రాజానగరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ సమీపంలో ఏర్పాటు చేసింది.

ఎయిర్ బెలూన్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న మోబైల్ థియేటర్ ఏసి వంటి సౌకర్యాన్ని కల్పించారు.

ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సారిగా ని ఏర్పాటు చేస్తున్న థియేటర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రారంభం కావాల్సిన ఉన్నా కొన్ని అనుమతులు రావడం ఆలస్యం కావడంతో మెగాస్టార్ ఆచార్య సినిమాతో ప్రారంభం అవుతున్నట్టు తెలుస్తోంది.

మొత్త సెటప్ అంతా ఒక ట్రక్ లో సరిపోయేంత ఉంటుందని సమాచారం.ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఏపిలో మరిన్ని థియేటర్లను ఏర్పాటు చేయాలని పిక్చర్ డిజిటల్ సంస్థ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఆ డైరెక్టర్ రెండు నెలలు తనతోనే ఉండాలన్నాడు.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!