సిపిఎం అభ్యర్థుల తొలి జాబితా ముగ్గురికి స్థానం…!
TeluguStop.com
నల్లగొండ జిల్లా: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections) నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థుల జాబితా ప్రకటించుకొని ప్రచారం కూడా చేసుకుంటున్నారు.
అభ్యర్థులను ప్రకటించే విషయంలో కొంత ఆలస్యం అయినా ఆదివారం సీపీఎం పార్టీ 14 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను విడుదల చేసింది.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇవాళ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు.
అభ్యర్థులు పోటీ చేసే జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లలోకి వెళ్లాలని పార్టీ సమావేశంలో నిర్ణయించినట్లు తమ్మినేని తెలిపారు.
మిగిలిన మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను త్వరలో విడుదల చేస్తామన్నారు.అసెంబ్లీలో సీపీఎం ప్రాతినిధ్యం కల్పించండని,తమ పార్టీకి ప్రాతినిధ్యం కల్పిస్తేనే పేద ప్రజల సమస్యల ప్రస్తావన అసెంబ్లీలో వస్తుందన్నారు.
చట్టసభల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టం,ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు.
ఈ విషయాలను తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు.సీపీఎం( CPM )తో పాటు వామపక్ష శక్తులను బలోపేతం చేయాలని ప్రజలను కోరారు.
సీపీఎం బలపరిచిన శక్తులకు సంఘీభావం తెలుపుతూ బీజేపీని నెట్టివేయాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని,బీజేపీ గెలిచే స్థానాల్లో బీజేపీని ఏ పార్టీ ఓడించినా తమ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
అనంతరంసీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ(Tammineni Veerabhadram ) ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేసి, మొత్తం 17 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.
సీపీఎం ప్రకటించిన తొలి జాబితాలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి
మిర్యాలగూడ-జూలకంటి రంగారెడ్డి,నకిరేకల్-చిన వెంకులు,భువనగిరి -నర్సింహ లకు స్థానం దక్కింది.
దేవర 100 డేస్ సెంటర్ల లెక్క ఇదే.. వామ్మో అన్ని థియేటర్లలో 100 రోజులు ఆడిందా?