ఫైనల్ జాబితా విడుదల .. జగన్ మార్క్ ట్విస్ట్ లూ ఉండబోతున్నాయ్

ఎట్టకేలకు వైసిపి అభ్యర్థులకు( సంబంధించి అయిదో జాబితా కూడా విడుదల అయిపోయింది.

ఈ జాబుతాను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana )విడుదల చేశారు.

మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి మార్పు చేర్పులు చేపట్టారు.ఇదే చివరి జాబితాగా వైసిపి సీనియర్ నాయకులు చెబుతున్నా, ఎన్నికల సమయం నాటికి మళ్ళీ భారీగా మార్పు చేర్పులు ఉండవచ్చని విశ్వసనీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ప్రస్తుతం వివిధ సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలను ఆధారంగా చేసుకుని ఐదు విడతలుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

అయితే జాబితాలోని ఎంపిక చేసిన అభ్యర్థులలో కొంతమంది వ్యవహారం అనుమానాస్పదంగా ఉండడం, కొంతమంది తమకు ఇచ్చిన సీట్లపై అసంతృప్తితో ఉంటూ ఇతర పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తూ ఉండడం, తదితర కారణాలతో మరోసారి మార్పులు చేరికలు ఉండే అవకాశం కనిపిస్తోంది.

"""/" / వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న జగన్ దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఎటువంటి సిఫార్సులను పట్టించుకోవడం లేదు.మొదటి నుంచి తన వెన్నంటే నడిచిన వారిని, బంధువులను సైతం చాలావరకు పక్కన పెట్టారు.

గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల జాబితాను ఎంపిక చేస్తున్నారు.వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలు తమను మళ్ళీ గట్టెక్కిస్తాయనే నమ్మకంతో జగన్ ఉన్నారు.

అందుకే అంత ధీమాగా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎటువంటి మొహమాటలకు వెళ్లకుండా కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు.

టిడిపి, జనసేన, బిజెపి, కాంగ్రెస్, ఇలా అన్ని పార్టీల లక్ష్యం వైసిపిని అధికారంలోకి రాకుండా చేయడమే కావడంతో, జగన్ కూడా అంతే స్థాయిలో పగడ్బందీగా వారి వ్యూహాలను చేదించేందుకు సిద్ధమవుతున్నారు.

"""/" / వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయం అనే ధీమాతో జగన్ ( Cm Ys Jagan )ఉన్నారు .

తాజాగా విడుదల చేసిన ఐదో జాబితాలో ఉన్న వారి పేర్లు, వివరాలను ఒకసారి పరిశీలిస్తే.

నరసరావుపేట పార్లమెంటుకు అనిల్ కుమార్ యాదవ్, మచిలీపట్నం పార్లమెంటుకు సింహాద్రి రమేష్, తిరుపతి పార్లమెంటుకు మద్దెల గురుమూర్తి , కాకినాడ పార్లమెంటుకు చలమలశెట్టి సునీల్.

అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికొస్తే సత్యవేడు నూక తోటి రాజేష్, అరకు మత్య లింగం, అవనిగడ్డ సింహాద్రి చంద్రశేఖర్ రావు.

రెండు రోజుల్లో జలుబు తగ్గాలంటే ఈ టీ తాగండి!