టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు రంగం సిద్ధం..!

టీఎస్పీఎస్సీ( TSPSC ) ప్రక్షాళనకు రంగం సిద్ధం అయిందని తెలుస్తోంది.ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి( Former DGP Mahender Reddy ) పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Tamilisai Soundararajan ) ఆమోదం కోసం ప్రభుత్వం సిఫారసు చేసింది.

ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఫైల్ రాజ్ భవన్ కు చేరింది.గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే అధికారికంగా ప్రకటించనున్నారు.

"""/" / రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు భరోసా కల్పించే విధంగా టీఎస్పీఎస్సీ పాలకమండలిని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.

ఛైర్మన్ తో పాటు పది మంది సభ్యుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది.

ఇందులో ఛైర్మన్ పదవికి కోసం యాభైకి పైగా అప్లికేషన్లు దాఖలు కాగా సభ్యుల కోసం 321 దరఖాస్తులు వచ్చాయి.

ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం అవుతారని సమాచారం.

రామ్ చరణ్ ఉపాసన ఆస్తుల విలువ తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!