ఫీజు నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. పి డి ఎస్ యు

ఖమ్మం జిల్లా( Khammam District )లో ప్రైవేట్, కార్పొ రేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలని పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్( Namala Azad ) డిమాండ్ చేశారు.

స్థానిక ఖమ్మం కలెక్టరేట్ లో పి డి ఎస్ యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా డిఅర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు.

ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలకు వేలు ఫీజులను అక్రమంగా వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్త మాంసాలతో వ్యాపారం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యాసంస్థలలో పుస్తకాలు, స్టడీ మెటీరియల్, డ్రెస్ ల పేరుతో అమ్మకాలు చేస్తూ విద్యను దుకాణాల్లో సరుకుల్లాగా కేజీల ప్రకారం అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు.

అక్షరాలపై లక్షల వ్యాపారం చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల( Private Institutions ) పైన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందారని ఆరోపించారు.

ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో కచ్చితంగా జీవో నెంబర్ 1, 4291 లను పాటించాలన్నారు.

పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సందర్శిస్తామని నిబంధనలు పాటించని పాఠశాలల గుర్తింపు రద్దయ్యేంతవరకు పోరాటం చేస్తాము అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి వెంకటేష్, జిల్లా నాయకులు కరుణ్, నాయకులు సాయి, రవితేజ, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

ఆ స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాకిచ్చిన పవన్ కళ్యాణ్.. డేట్ విషయంలో మార్పు లేనట్టేనా?