ఈ బుల్లి బైక్ ఫీచర్స్ అదుర్స్.. మడత పెట్టొచ్చు.. ఇన్వెర్టర్ గా వాడొచ్చు..!

చైనీస్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ఫెలో నూతనంగా ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్( Foldable Electric Scooter ) ను టోక్యో మోటార్ షోలో ప్రదర్శించింది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు ఫెలో టూ ఎం వన్.దీని ఫీచర్స్ అద్భుతం.

ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు.బైక్ ను కారు డిక్కీలో వేసుకుని క్యారీ చేయవచ్చు.

ఇంట్లో ఉంటే ఇన్వెర్టర్ గా వాడుకోవచ్చు.కేవలం దీని బరువు 37 కేజీలు.

ఈ బైక్ లో 1000 వాట్స్ పీక్ రేటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడి ఉంది.

48 వాట్ల 20 Ah బ్యాటరీ ఒక KWh సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

కేవలం ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.గంటకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది.

కేవలం నగరాలలో తిరగడానికి సౌకర్యంగా ఉండే విధంగా ప్రత్యేకంగా తయారు చేయబడింది. """/" / ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మరొక ఫ్యూచర్ ఏమిటంటే, ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ వస్తువులకు ఇన్వెర్టర్ గా వాడుకోవచ్చు.

ఇందుకోసం బ్యాటరీలు ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి.ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చైనా, జపాన్( China, Japan ) దేశాలలో అందుబాటులో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావడానికి ఇంకా నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ.2,900 అమెరికన్ డాలర్లు.

భారత కరెన్సీలో దాదాపు రూ.2,38,710 గా ఉండవచ్చు.

కానీ ఇంతకుముందే ప్రపంచ మార్కెట్లోకి 1981లో హోండా కంపెనీ నుండి ఓ ఫోల్డబుల్ బైక్ కారులో పట్టేంత చిన్నదిగా తయారు చేయబడి, మేటో కాంపో పేరుతో మార్కెట్లోకి వచ్చింది.

కానీ 1983లో కొన్ని కారణాలవల్ల ఆ బైక్ ఉత్పత్తిని నిలిపివేయడం.మళ్లీ 30 సంవత్సరాలకు చైనా ఈ కోవకు చెందిన మడత పెట్టే బైక్ ను మార్కెట్లోకి తెచ్చి సందడి చేసింది.

వీడియో: పురిటి నొప్పుల్లో ఉన్న జీబ్రాపై మగ జీబ్రా అరాచకం.. కళ్లముందే బిడ్డను చంపేసింది!