ప్రభాస్ డైరెక్టర్లు చేస్తున్న అతిపెద్ద తప్పు ఇదేనా.. ఆ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారా?

టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోలలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్నారు ప్రభాస్( Prabhas ).

వరుసగాపాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.ఇకపోతే డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్ లు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు.

ఇకపోతే ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తూ సినిమాలు పూర్తి చేసేసి సినిమా విడుదల వరకు దానిని చెక్కుతూ పర్ఫెక్ట్ గా ప్రమోట్ చేస్తూ ఆడియన్స్ దగ్గరకి తీసుకెళ్లే విషయంలో ఫెయిల్ అవుతున్నారు ప్రభాస్ డైరెక్టర్ లు.

"""/" / ప్రభాస్ నటిచిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ ఇప్పుడొచ్చిన కల్కి 2898 AD ( Kalki 2898 AD )చిత్ర దర్శకులు వరసగా అదే తప్పు చేసారు.

సినిమా విడుదలకు ముందు సినిమాని ఎంతగా, ఎలా ప్రేక్షకుల దగ్గరకి తీసుకెళ్ళాలి అనే ఆలోచన చెయ్యడం లేదు.

ప్రభాస్ తో సినిమా చేసాం అంతే చాలు అన్నట్టుగా వాళ్లు ఫీల్ అవ్వడంతో పాటు కానీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ల విషయంలో కూడా పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు.

"""/" / అంత పెద్ద స్టార్ ని ప్రమోషన్స్ కి రమ్మని ఏం అడుగుతామని అనుకుంటున్నారో లేదంటే మీడియా ముందుకు వచ్చేందుకు ప్రభాస్ ఇష్టపడడం లేదో కానీ ప్రభాస్ సినిమాలకు ప్రమోషన్స్ వీక్ అనేది పదే పదే రిపీట్ అవుతూనే ఉన్నాయి.

ఇదే ప్రభాస్ సినిమా కలెక్షన్లకు ఓ పెద్ద మైనస్ గా మారుతోంది.మరి ప్రభాస్ తో తదుపరి సినిమాలు చేసే దర్శకులైనా ఆ ప్రమోషన్స్ విషయంలో లెక్కలు వేసుకుంటారో లేదంటే వీరినే ఫాలో అవుతారో లేదో చూడాలి మరి.

ఎవరీ నిహారిక ఎన్ఎమ్.. గీతా ఆర్ట్స్ సినిమాలోని ఆఫర్ పొందడం ఆమె అదృష్టమా..??