డబ్బు కోసం కొడుకును అమ్మేసిన తండ్రి.. అసలు నిజం తెలిశాక..?

ఇటీవలే కాలంలో బయట వ్యక్తుల కంటే కుటుంబ సభ్యులే అత్యంత దారుణంగా తయారవుతున్నారు.

బయటి వ్యక్తులు కేవలం మోసం చేసి వదిలేస్తే.కుటుంబ సభ్యులు ఎంతటి దారుణం చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు.

ఓ తండ్రి డబ్బుల కోసం కన్న కొడుకుని అమ్మేశాడంటే.వినడానికే చాలా అసహ్యంగా అనిపిస్తుంది.

డబ్బు కోసం మరీ ఇంత నీచానికి పాల్పడాలా.? అసలు ఏం జరిగిందో చూద్దాం.

"""/" / ఆ తండ్రి డబ్బు కోసం కొడుకును అమ్మేశాక.ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా తన సోదరి వద్ద ఉన్నాడు.

పెంచుకోవడం కోసం బంధువులకు ఇచ్చాను అంటూ పలుసార్లు వివిధ కారణాలు చెప్పి బుకాయించాడు.

దీంతో ఆ బాలుడి మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

వరంగల్ లోని కరీమాబాద్ ( Karimabad )కు చెందిన మసూద్( Masood ) అనే వ్యక్తి డబ్బుల కోసం తన కొడుకును అమ్మాలని నిర్ణయించుకున్నాడు.

ఓ మహిళా మధ్యవర్తి ద్వారా హైదరాబాద్ లో ఉండే ఓ కుటుంబానికి అమ్మడానికి రూ.

2.5 లక్షల బేరం కుదుర్చుకున్నాడు.

నాలుగు రోజుల క్రితం పెద్ద కుమారుడు అయాన్ ను హైదరాబాదులోని ఆ కుటుంబానికి అప్పగించి రూ.

2.5 లక్షలు తీసుకున్నాడు.

"""/" / నాలుగు రోజుల నుండి అయాన్( Ion ) కనిపించటకపోవడంతో.భార్య తన కొడుకుని ఎక్కడికి తీసుకెళ్లాలని భర్తను ప్రశ్నించింది.

మొదట తన సోదరి వద్ద అయాన్ ఉన్నాడని మసూద్ తన భార్యకు మాయమాటలు చెప్పాడు.

కానీ భర్త మాటలపై అనుమానంతో భర్త సోదరికి ఫోన్ చేసి అడగగా అయాన్ తన వద్ద లేడని చెప్పింది.

దీంతో ఆ బాలుడి మేనమామకు విషయం తెలిసి గట్టిగా నిలదీస్తే, బంధువుల దగ్గర ఉన్నాడని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు తమదైన శైలిలో విచారించగా రూ.2.

5 లక్షలకు అమ్మిన నిజం చెప్పాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా ఈ వ్యవహారంలో మొత్తం ఐదు మంది వ్యక్తుల ప్రమేయం ఉందని తేల్చారు.

బాలుడిని సురక్షితంగా తల్లికి అప్పగిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

అయోధ్య రామ్‌లల్లాపై పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన లావోస్.. !!