చిన్నారి బర్త్ ‌డేను విమానంలో చేసిన తండ్రి.. వీడియో వైరల్!

ఈ రోజుల్లో చిన్నపిల్లల పుట్టిన రోజు వేడుకల్ని తల్లిదండ్రులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.

ఎందుకంటే, చిన్న పిల్లల ఆనందమే వారికి ఇపుడు అంతిమ లక్ష్యంగా మారింది.ఆమాత్రం డబ్బులున్నవారు కూడా ఇపుడు ఓ పదిమందికి భోజనం పెట్టకుండా ఎలాంటి ఫంక్షన్స్ చేయడం లేదు మరి.

పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా ఈ కల్చర్ వచ్చేసింది.మరీ ముఖ్యంగా మొదటి పుట్టిన రోజు వేడుకల్ని అయితే మరీ హాట్టహాసంగా జరుపుకోవడం మనం చూస్తూ వున్నాం.

ఒకరిని చూసి మరొకరు అన్నమాదిరి సెలిబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి.ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గురించి మీరు తెలుసుకుంటే, అంతకుమించి అనేలా వుంది కదా అని అనకమానరు.

"""/" / అవును, ఓ చిన్నారి తొలి పుట్టిన రోజు ఏకంగా గాల్లో జరిగిందంటే మీరు నమ్ముతారా? అంతెందుకు పాప బర్త్ డే ( Baby's Birthday ) ఇలా జరుగుతుందని చిన్నారి కుటుంబ సభ్యులే ఊహించలేదు మరి.

పాప బర్త్ డే సంబంధించిన వీడియోను తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

తన కూతురు బర్త్ డే ఇంత ఘనంగా జరిపినందుకు ఇండిగో ఎయిర్ లైన్స్ ( Indigo Airlines )ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గాల్లో ఎగురుతున్న ఇండిగో విమానంలో సిబ్బంది ఓ పాప బర్త్ డే ఘనంగా నిర్వహించడం కొసమెరుపు.

వీడియోలో కెప్టెన్ పాపను ఎత్తుకుని సీట్ల మధ్యలోకి వచ్చాడు.అతను " లేడీస్ అండ్ జెంటిల్‌మన్.

నా పేరు అగస్టిన్.అది ముఖ్యం కాదు, ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజు ఈ చిన్నారి మొదటి పుట్టినరోజు" అని ప్రకటించడంతో ఆ విమానంలో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది.

"""/" / అంతేకాకుండా సదరు సిబ్బంది మీరంతా ఈ పాపను ఆశీర్వదించండి.అని కూడా అనౌన్స్ కూడా చేశాడు.

దీంతో విమానంలో ఉన్న వారు పాపకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ ఘటన జూన్ 22న జరగగా తన తండ్రి తన ఆనందాన్ని.

"మా యువరాణికి 22 జూన్ 2023న సంవత్సరం నిండింది.ఇండిగో ఎయిర్‌లైన్స్ దీన్ని ప్రత్యేకంగా రూపొందించినందుకు చాలా కృతజ్ఞతలు " అంటూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ ద్వారా తెలియజేసాడు.

దాంతో నెటిజన్లు కూడా రకరకాలుగా ఆ పాపకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు."సో క్యూట్ అండ్ స్వీట్ ఇండిగో ఎయిర్‌లైన్స్, పుట్టినరోజు శుభాకాంక్షలు లిటిల్ ప్రిన్సెస్" అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

మరో యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?