కొడుకు పుట్టాలని కూతురుని దారుణంగా నరికేసిన తండ్రి!
TeluguStop.com
మన ఆలోచనలను గెలాక్సీని దాటించిన ఘనత సైన్స్ ది మాత్రమే.ఈ రోజు ఇంత గొప్ప లైఫ్ లీడ్ చేస్తున్నాం అంటే కేవలం సైన్స్ వళ్లే.
కానీ మనలో ఇంకా చాలా మంది తమ ఆలోచనలను ఆపేసి అనాగరికులు గా జీవిస్తున్నారు.
మంత్రాలకు చింతకాయలు రాలవని తెలిసినా.వాటినే నమ్ముతూ ఎన్నో అరాచకాలకు ఒడిగడుతున్నారు.
సమస్యలుంటే.డాక్టర్ ను సంప్రదించాలి.
ఏం చేయాలని అడగాలి.అలా కాకుండా జంతు బలి, ఇంకో బలి ఇస్తే సమస్య పరిష్కారం కాదని ఇంకెప్పుడు తెలుసుకుంటారు.
ముఖ్యంగా ఈ సమాజం లో చాలా మంది అబ్బాయిలకు ఇచ్చే ఇంపార్టెన్స్.అమ్మాయిలకు ఇవ్వటం లేదు అనేది నిజం.
దానికి కారణాలు ఇప్పటికే ఎన్నో చూసాం.ఇప్పుడు అలాంటి మరో దారుణం జార్ఖండ్ లో జరిగింది.
ఒక మాంత్రికుడి మాటలు నమ్మి కన్న కూతురిని చంపేశాడు ఒక వ్యక్తి.వివరాల్లోకి వెళితే రాంచీ, లోహర్ దగ్గరున్న పెష్రార్ లో ఉండే సుమన్ నగాసియా (26) కూలీగా పని చేస్తూ పొట్ట నింపుకుంటాడు.
అతడికి ఆరేళ్ల కూతురు ఉంది. """/"/
కొడుకు కావాలనే కోరిక తో నగాసియా సుజాన్ ఓజా అనే మాంత్రికుడిని సుమన్ సంప్రదించాడు.
దాంతో ఆ మాంత్రికుడు తన కూతురు ను బలి ఇస్తే కొడుకు పుడతాడని తెలిపాడు.
ఏది నిజం , ఏది నమ్మా లో ఆలోచించని సుమన్ తన కూతురు ని అత్యంత కిరాతకంగా చంపి తల నరికేశాడు.
ఇంట్లో అతని భార్య లేని సమయం చూసి ఈ దారుణానికి ఒడి కట్టాడు.
ఈ దారుణం పై సమాచారం అందుకున్న పోలీసులు సుమన్ ను అరెస్ట్ చేశారు.
మాంత్రికుడు కోసం గాలిస్తున్నారు.దీని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సుకుమార్ కూతురును మెచ్చుకున్న రామ్ చరణ్ దంపతులు.. అసలేం జరిగిందంటే?