నష్టపోయిన రైతులను ఆదుకోవాలి… అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా..

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల పరిధిలో కురిసిన అకాల వర్షాలు,వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపి ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూపంట నష్టం జరిగి రైతులు ఆవేదన చెందుతుంటే అధికాపార్టీ నాయకులు మరియు ఎమ్మెల్యే ఆత్మీయ సమ్మేళనలు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే కు రైతుల పంట నష్టం కనిపించడం లేదు అని అన్నారు.

ఎమ్మెల్యే ఎపుడు అందుబాటులో ఉంటరో ఎపుడు అందుబాటులో ఉండరో తెలీదు అని,ఎన్నికలు రాగానే వచ్చారు కానీ గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు,వడగండ్ల వానలకి రైతులకి బారోసా కల్పించకుండా, అధికారులతో సమీక్ష లు నిర్వహించకుండా సమ్మేళనాల పేరిట తిరుగుతున్నారని మండి పడ్డారు.

పంట నష్టం అంచనా వేయడంలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.పెద్ద మొత్తంలో పంటలు నష్ట పోయి ఉంటే అధికారులు తక్కువ మొత్తంలో నివేదికలు తయారుచేసి రైతులను ఇబ్బందులకి గురి చేస్తున్నారని,వెంటనే అధికారులు క్షేత్ర స్థాయిలో పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి నష్టపరిహారం వచ్చే విదంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్,బిజెపి మండల అధ్యక్షులు రాసురి నర్సారెడ్డి,కాంగ్రెస్ నాయకులు వార్డ్ సభ్యులు మాడిసెట్టీ అభిలాష్,తర్రే లింగం,రైతు సంఘం అధ్యక్షులు ఇప్ప నరేష్,బీఎస్పీ మండల అధ్యక్షులు కట్కురి శంకర్, అఖిలపక్ష నాయకులు అక్కేనపల్లీ శ్రీనివాస్, ఎర్రం అరవింద్,బర్కుల హరీష్,ఆకుల గగన్,గడ్డం గణేష్,గసికంటి సురేష్, నంద్యాడపు మల్లేశం రైతులు పాల్గొన్నారు.

అనంత్ అంబానీకి 40 కోట్ల విలువైన ఫ్లాట్ కానుకగా ఇచ్చిన స్టార్ హీరో?