అమరావతిలో రైతులు చేపట్టింది మహా పాదయాత్ర కాదు రాజకీయ పాదయాత్ర..వుండవల్లి శ్రీదేవి

అమరావతి రైతులు చేపట్టింది మహా పాదయాత్ర కాదు రాజకీయ పాదయాత్ర ఇది చంద్రబాబు నాయుడు పెట్టుబడి యాత్ర పాదయాత్ర ఎందుకో చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి టీడీపీ నేతలు అమాయకపు రైతుల చేత ఉద్యయం, పాదయాత్రలు చేయిస్తున్నారు.

రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ఉద్దేశ్యంతోనే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు మూడు రాజధానుల అంశం కోర్టులో నడుస్తుంది అలాంటప్పుడు ఎందుకు పాదయాత్రలు చేస్తున్నారు.

సింగపూర్ తలదన్నే రాజధానిని నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు ఎక్కడికి పోయాడు.రైతులను తాత్కాలికం అనే పేరుతో చంద్రబాబు మోసాగించారు నిజంగా రైతులకు సమస్యలు ఉంటే స్థానిక ఎమ్మెల్యే అయిన నన్ను కలసి సమస్య చెప్పాలి.

రైతులతో చర్చించడానికి మేము మా అధినేత సీఎం జగన్ ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ది కలుగుతుందని చెప్పారు.

పాదయాత్ర చేస్తున్న వారందరూ తుళ్లూరు నుంచి చంద్రబాబు ఉంటున్న ఉండవల్లి కి చేయండి.

పాదయాత్ర చేస్తున్న వారు తమ రూట్ మ్యాప్ ను మార్చుకొగలరు.పాదయాత్ర చేసిన వారందరు దేవుడి ముందు చెంపలు గట్టిగా కొట్టుకోoడి.

పవన్ కల్యాణ్ఉక్కు పరిశ్రమ పై ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడుతున్నారు.

పాదయాత్ర చేస్తుంది రాష్ర్టంలో టిడిపి అలజడి హింస సృష్టించడానికే.గ్రాఫిక్ రాజదాని కి చైర్మన్ గా చంద్రబాబు నీ నియమించాలి అని సీఎం జగన్ మోహన్ రెడ్డి నీ అడుగుతాను.

రాజదాని పై దమ్ముంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలి.

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న రాకింగ్ రాకేష్ కేసీఆర్.. ఇక్కడైనా హిట్టవుతుందా?