షర్మిలకు షాక్ ఇస్తున్న బాధిత కుటుంబాలు.. పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందే..
TeluguStop.com
తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని, పట్టు పెంచుకోవాలని వై.ఎస్.
షర్మిలకు మొదటి నుంచే షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.దీంతో అసలు ఆమెకు ఏం చేయాలో అర్థం కావట్లేదు.
ఆమె పార్టీలో అసలు చెప్పుకునేందుక ఒక్క పెద్ద నాయకులు కూడా లేకపోవడం పెద్ద సమస్యే అని చెప్పాలి.
ఈ నేపథ్యంలో ఆమె పార్టీని ముందుకు నడిపించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఆమె పార్టీలో ఉండే మిగతా వారు మాత్రం ఆమెకు వరుసగా షాక్ లు ఇస్తున్నారు.
ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు.ఇదే ఆమెకు పెద్ద తలనొప్పి అనుకుంటే అటు ప్రజలు కూడా ఆమెకు పెద్ద పెద్ద షాక్ లే ఇస్తున్నారు.
ఆమె ముందు నుంచి నిరుద్యోగుల కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఆమె ప్రతి మంగళవారం కూడా ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాల ఇంటికి వెళ్లి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వారి ఇండ్లకు వెళ్లి మరీ వారిని పరామర్శించడం లేదంటే వారి ఇంటి దగ్గర దీక్షలు చేయడం చూస్తూనే ఉన్నాం.
ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. """/"/
అయితే ఇప్పుడు ఆమె మంగళవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఆత్మ హత్య చేసుకున్న నరేష్ ఇంటికి వెళ్లాలని చూస్తే ఆయన తండ్రి మాత్రం షర్మిల తన ఇంటికి రావొద్దంటూ కోరుతున్నాడు.
అసలు కారణం ఏంటంటే ఇప్పుడు నరేశ్ ముగ్గురు అన్నలు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు.
ఇలాంటి క్రమంలో షర్మిల తమ ఇంటి వద్ద దీక్ష చేస్తే మిగతా కొడుకుల ఉద్యోగాలకు సమస్య వస్తుందని భావిస్తున్నారు.
ఈ భయంతోనే నరేశ్ షర్మిలను రావద్దని చెప్తున్నారంట.ఇంతకు ముందు కూడా ఇలాగే షర్మిలకు షాక్ తగిలింది.
సమంత తండ్రి మరణించినా ఆమెను ఓదార్చని సెలబ్రిటీలు.. ఇది మరీ దారుణం!