కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు..!!
TeluguStop.com
కేంద్రంలో ఎన్డీఏ( NDA ) ప్రభుత్వ ఏర్పాటుకు తీవ్ర కసరత్తు జరుగుతోంది.ఈ మేరకు జేపీ నడ్డా( JP Nadda ) నివాసంలో బీజేపీ సీనియర్ నేతలు భేటీ కానున్నారు.
ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఏర్పాటుతో పాటు మంత్రివర్గ కూర్పుపై నాయకులు చర్చించనున్నారు.ఈ క్రమంలో మంత్రివర్గ కూర్పుపై రేపు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు రేపు ఢిల్లీలో( Delhi ) ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం జరగనుంది.ఈ భేటీలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని ఎన్డీఏ నేతలు ఎన్నుకోనున్నారు.
అదేవిధంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ( Draupadi Murmu )నేతలు కలవనున్నారని సమాచారం.
కాగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కేంద్ర కేబినెట్ లో ప్రాధాన్యత దక్కనుంది.ఈ నేపథ్యంలో టీడీపీ, జేడీయూకు పెద్దపీట వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
నా ఎదుగుదలకు కారణం ఆయనే.. వైరల్ అవుతున్న బన్నీ షాకింగ్ కామెంట్స్!