జాతీయ ఉపాధి పనుల్లో భాగంగా వెంకట్రావుపేటలో రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్

రోడ్డు అంచనా విలువ 10 లక్షల రూపాయలు:రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో జాతీయ ఉపాధి పనుల్లో భాగంగా మెయిన్ రోడ్డు నుండి చెరుకుపల్లి నరసింహారెడ్డి పొలం వరకు రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ మంతెన సంతోష్.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మారినటువంటి వ్యవసాయం ఆధునికరణ తో ముందుకు పోతుందని ప్రతి రైతులు యంత్రాలతో పనులు చేపించుకునే పరిస్థితులు వచ్చినాయని కాబట్టి ప్రతి రైతు పంట పొలం ఇంటర్నల్ రోడ్లు పోసుకోవడం ఎంతో శ్రేయస్కరమని విధంగా ప్రతి రైతు తమ తమ రోడ్లు పోసుకోవడానికి సహకరించి గ్రామాన్ని ముందంజలో ఉంచాలని సర్పంచ్ తెలియజేశారు.

అదే విధంగా ఉపాధి పనిలో పాల్గొంటున్న కూలీలు ఎండ దెబ్బ తగలకుండా ఉదయం పూట పనులు ముగించుకోవాలన్నారు.

వారికి కావలసిన మంచినీళ్లు సదుపాయాన్ని గ్రామ సర్పంచ్ అందజేస్తామని మాటివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పల్లె మంజుల రవీందర్ రెడ్డి,ఉప సర్పంచ్ మేకల భూమయ్య, వార్డు సభ్యులు జర్రిగా మల్లేశం, పెద్ద వెంకటి,మంతెన రమేష్, కుమ్మరి దయాకర్, సెస్ ప్రతినిధి నాలిక వెంకటి, చెరుకుపల్లి నరసింహారెడ్డి, నాలిక నరసయ్య,బుట్టి దేవయ్య,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

జై హనుమాన్… హనుమంతుడిగా చరణ్ క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్?