నక్క తోక తొక్కిన ఉద్యోగి.. లక్కీ డ్రాలో 365 డేస్ పెయిడ్ లీవ్స్!

సాధారణంగా ఆఫీసులో వారం రోజులు పెయిడ్ లీవ్( Paid Leave ) ఇస్తేనే ఎంతో సంతోషపడుతుంటాం.

అయితే చైనా( China )లోని ఒక కంపెనీ తన ఉద్యోగికి ఏకంగా 365 రోజుల పెయిడ్ లీవ్ ( 365 Days Paid Leave )ఆఫర్ చేసింది.

అంతే అతడు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తున్నాడు.కంపెనీ వివరాలు తెలియలేదు కానీ, ఆ కంపెనీ ఎంప్లాయ్‌కి లక్కీ డ్రాలో 365 పెయిడ్‌ లీవ్‌ చెక్ ఆఫర్ చేసింది.

చైనాలోని షెన్జెన్‌లో జరిగిన కంపెనీ యాన్యువల్ డిన్నర్ పార్టీలో ఈ లక్కీ డ్రా నిర్వహించారు.

ఈ వివరాలను చైనీస్ న్యూస్ మీడియా వెల్లడించింది.ఈ ఉద్యోగికి సంబంధించిన ఒక ఫొటోతో పాటు వీడియో కూడా వైరల్‌గా మారింది.

ఇందులో ఒక ఉద్యోగి కుర్చీలో కూర్చుని ఉన్నాడు.అతడి చేతిలో భారీ చెక్ ఉంది.

ఆ చెక్ పై చైనా భాషలో "365 డేస్ ఆఫ్ పెయిడ్ లీవ్స్" అని రాసి ఉంది.

"""/" / చైనాకు చెందిన వార్తా సంస్థ స్ట్రైట్స్ టైమ్స్ ఈ ఉద్యోగికి సంబంధించిన వార్తను కవర్ చేసింది.

కాగా విన్నర్‌ని ఇప్పటివరకు ఏ న్యూస్ మీడియా ఇంటర్వ్యూ చేయలేదు.సదరు వ్యక్తి కంపెనీలో మేనేజర్ హోదాలో ఉన్నట్లు సమాచారం.

లక్కీ డ్రాలో గిఫ్ట్స్, పెనాల్టీలు రెండూ ఉన్నాయి.పెనాల్టీలో 'స్పెషల్ హోమ్‌మేడ్ డ్రింక్' తాగడం లేదా వెయిటర్‌గా సేవ చేయడం ఉంది.

బహుమతులలో ఒకటి లేదా రెండు విశ్రాంతి రోజులు లేదా వార్షిక సెలవులు ఉన్నాయి.

కాగా 365 రోజుల వేతనంతో కూడిన సెలవు ఒక్కటే వీటిలో అతి పెద్ద బహుమతి.

"""/" / దీనిని ఒక లక్కీ మేనేజర్ సొంతం చేసుకున్నాడు.అయితే సంవత్సరానికి సరిపడా శాలరీని అతడు డబ్బుగా పొందొచ్చు.

లేదంటే సెలవు తీసుకొని నెలనెలా జీతం అందుకోవచ్చు.ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు "వాట్‌ ఏ లక్కీ ఛాన్స్, నువ్వు నక్క తోక తొక్కినవ్ భయ్యా" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే కంపెనీ ఈ లెవెల్లో బహుమతులను ఆఫర్ చేయడానికి ఒక రీజన్ ఉంది.

అదేంటంటే కరోనా వల్ల చైనా కంపెనీ యాన్యువల్ డిన్నర్ పార్టీని మూడేళ్ల పాటు నిర్వహించలేదు.

ఎట్టకేలకు దీనిని భారీగా నిర్వహించాలనే ఉద్దేశంతో బహుమతులను అందజేసింది.

వైరల్ వీడియో: ఏంటి భయ్యా.. నడిరోడ్డుపై లాంగ్ జంప్ చేస్తున్న దెయ్యాలు..