స్టూడెంట్ల మీద భ‌యంక‌రంగా దాడి చేసిన ఏనుగు.. చివ‌ర‌కు

స‌హ‌జ సిద్ధంగా అడ‌వుల్లో బ‌తికే జంతువుల‌కు కొన్ని ల‌క్ష‌ణాలు ఉంటాయి.అవి మామూలుగా దాడులుకు దిగిపోతుంటాయి.

వాటికి మ‌నుషుల్లాగే వెన‌కా ముందు ఆడే ల‌క్ష‌ణం ఉండ‌దు.అమాంతం దాడిచేసి చంపేస్తాయి కూడా.

వాటిని ప‌దే ప‌దే విసిగిస్తే ఊరుకుంటాయా.గ‌తంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌నం అనేకం చూస్తున్నాం.

అడ‌వుల్లోకి వెళ్లిన టూరిస్టులు కావాల‌ని వాటిని విసిగించి చివ‌ర‌కు ఇబ్బందులు ప‌డ్డ ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి.

ఇలాంటివి చూసినప్పుడు  అయినా వాటి స‌హ‌నాన్ని ప‌రీక్షించొద్ద‌ని తెలుసుకోకుండా అలాగే చేయ‌డం వ‌ల్ల ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు.

ఇప్పుడు కూడా కొంద‌రు ఎకో ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్లు, ట్రైనీలు ఇలాగే చేసి చివ‌ర‌కు ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నారు.

భారీ ఏనుగులు దాడి చేసేందుకు రావ‌డంతో చివ‌ర‌కు ప‌రుగు లెక్కించుకున్నారు.ఇందుకు  సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చెక్క‌ర్లు కొడుతోంది.

దీన్ని చూస్తే మీరు కూడా ఇలాంటి ప్ర‌యోగాలు అవ‌స‌ర‌మా అంటూ కామెంట్ చేస్తారు కావ‌చ్చు.

కొంద‌రు స్టూడెంట్లు క‌లిసి దక్షిణాఫ్రికాలోని లింపోపోలోని సెలటి గేమ్ రిజర్వ్ ప్రాంతంలో టూర్‌కు వెళ్లారు.

వారు అంద‌రూ త‌మ కారు మీద అలా కొంత దూరం వెళ్ల‌గానే కొన్ని ఏనులుగు క‌నిపించాయి.

"""/" / అయితే అప్ప‌టికే ఏనుగులు వీళ్ల మీద కోపాన్ని చూపిస్తున్నాయి.అయినా స‌రే అలాగే ముందుకు వెళ్ల‌డంతో స‌డెన్ గా ఓ ఏనుగు పొదల్లో నుంచి వ‌చ్చి దాడి చేసింది.

నానా ర‌భ‌స సృష్టించింది.ఈ ఘ‌ట‌న‌లో స్టూడెంట్లు కారు దిగి పారిపోవ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.

కాగా ఇందులో ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని స‌మాచారం.కానీ కారు మాత్రం ఈ డాడిలో చాలా దారుణంగా పాడైపోయింది.

ఇందుకు సంబంధించిన రెండు, మూడు వీడియోలు  బాగా వైర‌ల్ అవుతున్నాయి.మ‌రి వాటిని మీరు కూడా చూసేయండి లేటెందుకు.

Chandrababu : ఏపీ భవిష్యత్ కోసమే మూడు పార్టీల పొత్తు..: చంద్రబాబు