ఎన్నిక వేళ తాయిలాల పర్వం... మరీ ఇంత పోటీనా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక త్వరలో జరగనున్న తరుణంలో పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.

అయితే పండగ వేళ ఓటర్లను రకరకాల తాయిలాలతో ప్రలోభ పరుస్తున్న వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఇప్పుడు ఇక్కడ ఒక పార్టీతో కలిసి మరో పార్టీ పోటీలు పడుతున్న పరిస్థితి ఉంది.

ఎందుకంటే పండగ ల వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే ఓటర్లకు తమ పార్టీపట్ల సానుకూల వాతావరణం ఉంటుందనేది పార్టీల వ్యూహం.

అయితే ఓటర్ లను పోలింగ్ సమయంలో తమ పార్టీపై అభిప్రాయాన్ని స్వేచ్చగా వ్యక్తం చేసుకునే అవకాశాన్ని, వాతావరణాన్ని పార్టీలు కల్పించడం లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

"""/"/ అయితే ఇప్పటికే చాలా వరకు పార్టీలు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దనే ఉద్దేశ్యంతో వందకు వంద శాతం గెలుపు వ్యూహాలకు పదును పెడుతూ విజయం దిశగా వెళ్లేందుకు కృషి చేస్తున్న పరిస్థితి ఉంది.

అంతేకాక అయితే పండగల పూటా తాయిలాల అంశం అందరూ ఊహించినదే అయినా ఈ విషయంలోనూ పోటీ పడతారా అంటూ సామాన్య జనం విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ప్రజలు తాయిలాలను నిరాకరించే పరిస్థితి ప్రస్తుతం లేకున్నా ఎన్నికల సమయంలో వారి తీర్పు ఎలా ఉంటుందనేది ఫలితాలు వచ్చే వరకు ఏ ఒక్కరూ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది.

అంతేకాక సామాన్య ప్రజానీకంపై పార్టీల వ్యవహార శైలిపై కొంత విజ్ఞావంతులైన వ్యక్తులు మాత్రం అంతర్గతంగా కొంత నవ్వుకుంటున్న పరిస్థితి ఉంది.

అంతేకాక ఇప్పుడు ఈ ఉప ఎన్నికను చావోరేవో అన్న రీతిలో పార్టీలు భావిస్తున్న వేళ తమ వ్యవహారాల పట్ల పార్టీలు ఏ మాత్రం వ్యతిరేకించలేని పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

నెల్లూరు కూటమి రోడ్ షోలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!