ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు నిలిపివేయాలి..: ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు.

ఈ క్రమంలో ఎన్నికల ప్రధాన అధికారి అందుబాటులో లేకపోవడంతో ఆయన కింది స్థాయి అధికారులను కలిశారని తెలుస్తోంది.

గద్వాల ఎమ్మెల్యే కేసు సుప్రీంకోర్టులో విచారణ ఉందన్న కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను నిలిపి వేయాలని కోరారు.

కేసు విచారణ అనంతరం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు మెయిల్ ద్వారా కూడా ఎన్నికల సంఘానికి కృష్ణ మోహన్ రెడ్డి లేఖ రాశారు.

కాగా గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా కృష్ణ మోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసిన ధర్మాసనం డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కురులకు అండగా కరివేపాకు.. ఇలా వాడితే మస్తు లాభాలు!