హైదరాబాద్ లో ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసిన ఎలక్షన్ కమిషన్..!!

రేపు తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్( Telangana Elections ) నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది.ఈ క్రమంలో విధి నిర్వహణలో పక్షపాతం చూపించారని హైదరాబాద్ లో( Hyderabad ) ముగ్గురు పోలీసులను.

ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడం జరిగింది.ముషీరాబాద్ లో ఓ అపార్ట్మెంట్ లో 18 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ డబ్బు బీఆర్ఎస్ అభ్యర్థి.ముఠా గోపాల్( Muta Gopal ) కుమారుడు జయసింహాకు( Muta Jaisimha ) చెందినవి అయితే.

ఎఫ్ఐఆర్ లో గుర్తు తెలియని వారిగా నిందితుల పేర్లను చేర్చారు.దీంతో ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదని.

ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. """/" / అంతేకాకుండా ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది.

సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ లపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది.

మరి కొద్ది గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్( Election Commission ) ఎక్కడ అవాంతర సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు 119 నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది.ఈ క్రమంలో ఈసారి తెలంగాణలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు కేసీఆర్( KCR ) అధికారంలోకి వచ్చారు.

మరి మూడోసారి పోటీ చాలా గట్టిగా ఉన్నట్లు సర్వేలు తెలియజేశాయి.దీంతో తెలంగాణ ప్రజలు ఈసారి ఎవరికీ అధికారం ఇస్తారు అన్నది ఎవరు చెప్పలేకపోతున్నారు.

ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిన నటుడు మాధవన్… ధర ఎంతో తెలుసా?