జనసేన కు ‘గాజు గ్లాస్ ‘ లేనట్టేనా ?

ఏపీలో ఎన్నికల సమయంలో దగ్గరపడిన నేపథ్యంలో, జనసేన పార్టీకి పెద్ద చిక్కే వచ్చి పడింది.

ప్రస్తుతం పొత్తుల వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు.టిడిపి, బిజెపి లను కలుపుకొని ఎన్నికలకు వెళ్లి వైసీపీని ( YCP )ఓడించాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు.

అయితే ఇప్పుడు జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు దూరమైంది.ఇప్పటి వరకు ఉన్న గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల కమిషన్ ఆ పార్టీకి కేటాయించలేదు.

ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాసు గుర్తు కనిపిస్తోంది .

ఏపీ నుంచి టిడిపి, వైసిపి( TDP )లు మాత్రమే రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలు.

దీంతో ఆ గుర్తులను వాటికే రిజర్వ్ చేశారు. """/" / జనసేనకు మాత్రం ఆ అవకాశం దక్కకపోవడంతో,  జనసైనికుల్లో అయోమయం నెలకొంది.

అసలు జనసేన కు గాజు గ్లాస్ గుర్తు పోవడానికి కారణం ఈసీ గుర్తింపునకు తగ్గట్లుగా జనసేన పార్టీకి ఓట్లు రాకపోవడమే కారణం.

రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలి అంటే , మొత్తం పోలైన ఓట్లలో కనీసం 6% ఓట్లు,  కనీసం రెండు అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీ కి రావాలి.

కానీ 2019 ఎన్నికల్లో జనసేనకు 5.9% మాత్రమే ఓట్లు వచ్చాయి.

ఒకే అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు.అందుకే ఈసీ గుర్తింపు పొందలేకపోయారు.

అయితే ఇక్కడే జనసేనకు కలిసి వచ్చే అంశం తెరపైకి వచ్చింది.  ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తమ పార్టీ అభ్యర్థులందరికీ ఒకే గుర్తు కేటాయించాలని ఈసీని అడిగేందుకు అవకాశం ఉన్నట్లుగా నిపుణులు పేర్కొంటున్నారు.

2019 ఎన్నికల్లో జనసేన గాజు గ్లాస్ గుర్తు పైనే పోటీ చేసింది.ఈసారి టిడిపి ,బిజెపి లతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళితే అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసేందుకు అవకాశం ఉండదు.

""img / కేవలం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన అభ్యర్థులు పోటీకి దిగుతారు.

  అయితే గాజు గ్లాసు గుర్తు  జనసేన( Jana Sena ) కేటాయించకపోతే ఇండిపెండెంట్లు అదే గుర్తులు కోరే అవకాశం ఉంది .

పొత్తులు ఉన్నచోట ఎన్నికల గుర్తు విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడి కోట్ల బదలాయింపు ఆశాజనకంగా ఉండకపోవచ్చు.

మొత్తంగా ఈ వ్యవహారం లో జనసేనకు ఎన్నికల సమయంలో పెద్ద తలనొప్పిగానే మారే అవకాశం కనిపిస్తోంది.

జావెలిన్ గురించి తెలీదంటూ కాంట్రవర్షల్ కామెంట్స్.. ట్రోలర్స్‌కి ఇచ్చిపడేసిన సైనా నెహ్వాల్..?