ఈ తేదీలలో పుట్టిన వారిపై సూర్యుడి ప్రభావం అధికంగా ఉంటుంది... వీరిని పెళ్లి చేసుకుంటే అదృష్టమే!

సాధారణంగా ప్రతి ఒక్కరు వారి భవిష్యత్తులో జరిగే మంచి చెడులను ముందుగా తెలుసుకోవడం కోసం హస్త సాముద్రికం, జ్యోతిష్య శాస్త్రాన్ని ఎలా నమ్ముతారో మరికొందరు కూడా న్యూమరాలజీని అదేవిధంగా నమ్ముతారు.

మన జీవితంలో నక్షత్రాలు, రాశులు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో అలాంటి ప్రభావాన్ని మనం పుట్టిన తేదీలు కూడా మన పై ప్రభావాన్ని చూపిస్తాయి.

ఈ క్రమంలోనే న్యూమరాలజీ నమ్మేవారు ఇలాంటి విషయాలను ఎంతో ఎక్కువగా విశ్వసిస్తారు.న్యూమరాలజీ ప్రకారం సంఖ్యాశాస్త్రంలో ఒకటి నుంచి తొమ్మిది అంకెలు ఉంటాయి.

రాడిక్స్ సంబంధాలు కూడా నవగ్రహాలలో ఏదో ఒక గ్రహంతో ముడిపడి ఉంటాయి.ఈ క్రమంలోనే న్యూమరాలజీ ప్రకారం 01, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారిని 1వ రాడిక్స్ అంటారు.

ఈ ఒకటవ రాడ్స్ కు సూర్యుడు అధిపతి కనుక ఈ తేదీలలో పుట్టిన వారి పై సూర్యుడి ప్రభావం అధికంగా ఉంటుంది.

అలాగే ఈ తేదీలలో పుట్టిన వారికి ఎక్కువగా తెలివితేటలు ఉంటాయి. """/" / ఈ తేదీలలో పుట్టిన వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.

వీరు చేసే ఏ పనిలో నైనా సిద్ధాంతాలను నమ్ముతూ పనులను ప్రారంభిస్తారు.అలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు ఎంతో నమ్మకంగా ఉండటం వల్ల వీరి పై చాలా మంది అభిమానాన్ని చూపిస్తారు.

ఇక ఈ తేదీలలో పుట్టిన వారు జీవిత భాగస్వామి అయితే నిత్యం వారి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా గడుపుతారు.

వీరిపై ఆ సూర్యభగవానుడు ఆశీర్వాదం ఉండటంవల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉండటమే కాకుండా వీరు జీవితంలో అదృష్టం కూడా కలిసి వస్తుంది.

వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి, రక్తహీనతను తరిమికొట్టే బెస్ట్ జ్యూస్ ఇది.. తప్పక డైట్ లో చేర్చుకోండి!