మెట్లు దిగకుండా పాపాయిని అడ్డుకున్న కుక్క.. ఎలా రక్షిస్తుందో చూస్తే..

మెట్లు దిగకుండా పసికందును కాపాడుతున్న కుక్క( Dog ) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నెలపై పాకుతూ వెళ్తున్న పసిబిడ్డను గది నుంచి బయటకు రాకుండా ఆపడానికి సదరు కుక్క చాలా ప్రయత్నించింది.

ఒక తల్లిలాగా ఆ కుక్క అద్భుతమైన ప్రవృత్తి, విధేయతను చూపించింది.ఈ వీడియోను రెడిట్‌లో “గుడ్ డాగ్ కీపింగ్ బేబీ సేఫ్” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.

"""/" / వీడియో క్లిప్ పసిబిడ్డ నేలపై అంబాడుతూ ముందుకెళ్లడంతో ప్రారంభమవుతుంది.కొద్దిసేపటి తర్వాత, ఆ చిన్నారి బయట మెట్ల దారికి దారితీసే తలుపును చేరుకుంటుంది.

ప్రమాదాన్ని పసిగట్టిన కుక్క, బిడ్డను వెంబడించి చిన్నారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.కుక్క తన నోటితో బిడ్డను ఎత్తుకుని, బిడ్డ వీపుపై తన పంజా పెట్టి మెట్ల కు దూరంగా వెళ్లేలా చేస్తుంది.

ఇన్ని ప్రయత్నాలు చేసినా బిడ్డ అటువైపే వెళ్తుండటంతో కుక్క చివరకు తలుపు ముందు పడుకుని, బిడ్డను మరింత ముందుకు వెళ్లకుండా చేస్తుంది.

"""/" / వీడియో రెడిట్‌లో 52,000కు పైగా అప్‌వోట్‌లను పొందింది.చాలామంది ఈ కుక్కను చాలా పొగిడారు.

అంతేకాదు తమ కుక్కలు కూడా ఇలాంటి పనులు చేశాయని వారి సొంత స్టోరీలను పంచుకున్నారు.

కుక్కలకు మాటలు రావేమో కానీ అవి యజమానులను వారి పిల్లలను కాపాడడంలో ఎల్లప్పుడూ ముందుంటాయి చాలా ఘటనలలో ఇవి యజమాని వారిని కాపాడాయి అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు.

ఇక వీడియోలో కనిపించిన కుక్క చాలా తెలివైనదని అది ఏం చిన్నారి మెట్లు తగిలి కింద పడిపోతుందేమో అని గ్రహించే మెట్ల దగ్గరే అది కూర్చుని కాపలా కాస్తోంది.

ఇలాంటి కుక్కలు పెంచుకుంటే చాలు అవి ఏ ప్రమాదమైనా పసిగట్టి కాపాడతాయి అని మరికొందరు అన్నారు.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

వామ్మో.. కార్ క్యాబిన్ ఓపెన్ చేయగా దిమ్మ తిరిగే సీన్..