నో అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నా కుక్క.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ చిన్న విషయం జరిగిన క్షణాల్లో ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారికైనా సరే తెలిసిపోతుంది.

సోషల్ మీడియాలో ప్రతి రోజు ఎన్నో పెంపుడు జంతువుల వీడియోలను ప్రజలు పోస్ట్ చేస్తూనే ఉంటారు.

అటువంటి వాటిలో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.దాదాపు చాలామంది ఇళ్లలో పెంపుడు జంతువులుగా కుక్కలని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు.

ఎందుకంటే కుక్కలు తమను పెంచుతున్న యజమానులపై విశ్వాసం కలిగి ఉంటాయి.దాదాపు ఎక్కువగా మనుషులలో తిరిగి అవి కూడా మనుషుల లాగా ప్రవర్తిస్తూ ఉంటాయి.

తాజాగా ఒక పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కేవలం 19 సెకండ్లు మాత్రమే ఉన్న ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.

ఇప్పటివరకు ఈ వీడియోను 1.8 మిలియన్ల మంది చూశారు.

87000 మంది లైక్లు కూడా చేశారు.చాలామంది ఇళ్లలో పెంపుడు జంతువులకు ఏ ఆహారం అయితే అవి ఇష్టంగా తింటాయో వాటిని ఎక్కువగా తినిపిస్తూ ఉంటారు.

అలాగే చాలామంది తమ పెంపుడు కుక్కలకు కూడా ఇష్టమైన ఆహారాన్ని పెడుతూ ఉంటారు.

అయితే ఇక్కడ ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పెంపుడు కుక్క తనకు నచ్చని ఆహారాన్ని ఇస్తే ఎలా చేస్తుందో ఈ వీడియోలో చూడవచ్చు.

"""/"/ ఇక్కడ ఒక కుక్కకు ముందు ఒక జున్ను ముక్క పెడితే ఏమి చెప్పకుండా తినేస్తుంది.

కానీ ఆ తర్వాత బ్రోకలీ ఇస్తే మాత్రం వద్దు అన్నట్లు తలను రెండుసార్లు అడ్డంగా ఊపుతుంది.

అలా తల అడ్డంగా ఊపింది అని మళ్లీ ఒక జున్ను ముక్క తినిపిస్తే దాన్ని కూడా తినేస్తుంది.

ఆ తర్వాత ఒక క్యారెట్ ఇస్తే వద్దు అంటూ తల అడ్డంగా ఊపడం ఆ వీడియోలో చూడవచ్చు.

చాలామంది మనుషులు తమకు ఇష్టం లేని ఏదైనా పని గురించి నో చెప్పడానికి మొహమాటపడుతుంటారు.

కానీ ఈ కుక్క ఏ మాత్రం ఆలోచించకుండా నో చెప్పేస్తోంది.

రెబల్స్ చేతుల్లోకి పాలన .. సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు