ఆసుపత్రిలో డ్యాన్స్‌తో అదరగొట్టిన డాక్టర్లు, నర్సులు.. చివరకు?(వీడియో)
TeluguStop.com
ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) యుగంలో ప్రపంచం ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరికి విషయం ఇట్లే తెలిసిపోతుంది.
ఈ క్రమంలో ఎక్కువగా చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే కొరకు వివిధ రకాల సాహసాలు చేయడంతో పాటు.
వారిలో ఉన్న ట్యాలెంట్ ను బయట పెడుతూ డాన్సులు, ఆటలు, పాటలు లాంటివి చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలో కొంతమంది అందరినీ ఆకట్టుకుంటూ ఉంటే మరికొందరు చిక్కులలో పడతారు.అచ్చం అలాగే తాజాగా డాక్టర్లు, నర్సులు కలిసి చేసిన డాన్స్ కాస్త వైరల్ అవ్వడంతో ఆగ్రహానికి గురయ్యారు అధికారులు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే. """/" /
ఉత్తరప్రదేశ్ లోని దీనదయాళ్ ఉపాధ్యాయ్ జిల్లా ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్ లతో పాటు వైద్యులు డాన్స్ చేయడం చర్చనీయా సంఘటనగా మారింది.
దీంతో నర్సులు, వైద్యుల తీరుపై అనేక రకాల ప్రశ్నలు వస్తున్నాయి.వాస్తవానికి స్టాఫ్ నర్సులు కు ప్రమోషన్ వచ్చిన సందర్భంలో వారు చిన్న పార్టీ ఏర్పాటు చేశారు.
అది కూడా బయట ఎక్కడో కాకుండా ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసి పార్టీని ఎంజాయ్ చేశారు.
ఇందులో సిఎంఎస్ఎంఎస్ వైద్యులు ఇతర సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తుంది.ఇందులో భాగంగా అందరూ కూడా హిందీ భోజ్‌పురి పాటకు డాన్స్ వేయడం ఫుల్లుగా డిజె సౌండ్ పెట్టి స్టెప్పులతో అదరగొట్టేశారు.
ఈ క్రమంలో ఆస్పత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారి పరిస్థితి ఏమిటా అని పలు రకాల ప్రశ్నలు చాలామంది వేస్తున్నారు.
చివరికి ఈ వ్యవహారం మొత్తం అధికారిక యంత్రం నుంచి ప్రభుత్వం వరకు అందరికీ చేరుకొని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
ఈ వైరల్ వీడియో చివరకు డిప్యూటీ సీఎం ఆరోగ్యశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ వీక్షించగా.
ఆయన స్పందించారు.స్టాఫ్ నర్సులు, ఇతర ఉద్యోగులు చేసిన డాన్స్ ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, ఈ సంఘటనపై దర్యాప్తు మొదలు పెట్టాలని వారణాసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
అలాగే ఆస్పత్రులు ఆరోగ్య దేవాలయాలని ఇలా చేయడం చాలా తప్పు అంటూ బ్రజేష్ పాఠక్ పేర్కొన్నారు.
2025 లో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి వారసులు…