రాష్ట్ర విభజన పార్లమెంట్ లో జరిగింది నారా లోకేష్

రాష్ట్ర విభజన పార్లమెంట్ లో జరిగింది.ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం పార్లమెంట్ లో పాస్ అయ్యింది.

అందులో స్పష్టంగా ఒక రాజధాని అని అన్నారు.రాజధానులు అని లేదు.

దాని ఆధారంగానే కోర్టు తీర్పు ఇచ్చింది.రాజధాని అంశానికి సంబంధించి ఇచ్చిన తీర్పుని పట్టుకొని శాసనసభ కి ఏ అధికారాలు లేవా అంటూ ప్రజల్ని జగన్ రెడ్డి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

తీర్పులను గౌరవించకుండా న్యాయ వ్యవస్థను కించపరిచేలా శాసనసభ వేదికగా మాట్లాడటం బాధాకరం.మాది సింగిల్ పాయింట్ ఎజెండా రాష్ట్రానికి ఒకే రాజధాని.

అభివృద్ధి వికేంద్రీకరణ.పదో తరగతి ఫెయిల్ అయిన వైసిపి నాయకులకు, అసలు ఏమి చదివాడో తెలియని జగన్ రెడ్డికి చట్టాల గురించి ఏం తెలుస్తుంది.

అభివృద్ధి వికేంద్రీకరణ మేము చేసి చూపించాం.రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని పరిశ్రమలు వచ్చాయో.

మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చర్చకు సిద్దమా.చంద్రన్న పెళ్లి కానుక, అన్నా క్యాంటీన్, చంద్రన్న బీమా, విదేశీ విద్యఇలాంటివి చంద్రబాబు గారి బ్రాండ్ లు.

అమరావతి తో సహా చంద్రబాబు గారు తెచ్చిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన జగన్ రెడ్డి అవి మా బ్రాండ్లు అయితే రద్దు చెయ్యకుండా ఉండేవారా.

చెత్త బ్రాండ్లు తెచ్చింది జగన్ రెడ్డే.వైసీపీ హాయాంలో 141 బ్రాండ్ లు వచ్చాయని ప్రభుత్వమే ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చింది.

సభ లో చర్చకు అనుమతి ఇస్తే జే బ్రాండ్స్ బాగోతం బయటపడుతుంది.మండలి ఛైర్మెన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు.

పెళ్లి కూతురు ముందే వరుడి చెవిలో గుసగుసలాడిన ఫ్రెండ్.. చివరకు?