డ్రగ్స్, గంజాయి నివారణకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట చర్యలు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) పరిధిలో గంజాయి, గుట్కాతో పాటు ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసలు కాకుండా కాపాడుకుందామని,మాధకద్రవ్యాల నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు.

2023 సంవత్సరం జిల్లాలో గంజాయి కి సంబంధించి మొత్తం 58 కేసులు నమోదయ్యాయి.

ఇందులో 127 మందిని అరెస్టు చేయడంతో పాటుగా 70.674 KGs గంజాయిని సీజ్ చేసి 105 మందికి జైలు శిక్షలు పడేలా కృషి చేయడం జరిగింది.

జిల్లాలో మాధకద్రవ్యాలకు అలవాటు పడిన వారిని సన్మార్గంలో నడిపించేందుకు , డి-అడిక్షన్ సెంటర్ ఏర్పటు చేసి సైకలజిస్ట్,సైకియాట్రిస్ట్ డాక్టర్స్ తో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, డి-అడిక్షన్ సెంటర్ లో కౌన్సెలింగ్ కొరకు పెరు నమోదు మరియు ఇతర సమాచారం కోసం స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ రవికుమార్ ఫోన్ నెంబర్ 8712656410, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఫోన్ నెంబర్ 8712656411 లను సంప్రదించాలని, ఈ డి-ఆడిక్షన్ సెంటర్ త్వరలో ప్రారంభిచడం జరుగుతుందన్నారు.

జిల్లాలో మాధకద్రవ్యాల( Drugs ) నిర్ములనే లక్ష్యంగా జిల్లాని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసి గంజాయి,మాధకద్రవ్యాల వలన కలుగు అనార్ధాల మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఇప్పటికే జిల్లాలో పాటశాలల్లో, కళాశాలల్లో అంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి విద్యార్థులు మాధకద్రవ్యాల మీద అవగాహన కల్పిస్తు వారిలో మాధకద్రవ్యాల మీద చైతన్యాన్ని కల్పించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

ఈ మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం రోజున ఒక ప్రకటన జారీ చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటిని యువతకు దూరం చేయాలనే లక్ష్యంగా జిల్లాలో టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో( Task Force ) రెండు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ టీమ్స్ జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి, గుట్కా సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాడం జరుగుతుందని,పదే పదే అక్రమ గంజాయి, మాధకద్రవ్యాల రవాణాకు పాల్పడితే వారిమీద హిస్టరీ షీట్స్, పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు.

నిర్మానుష్య ప్రదేశాల్లో పాడుబడ్డ భవనాల లో యువత ఎక్కువగా గంజాయి తీసుకునే అవకాశం ఉన్నందున వాటిపై నిఘా పెట్టాలని, గంజాయి సేవించేవారు ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకుంటున్నారని వారి యొక్క కదలికలపై నిఘా పెట్టాలని, జిల్లాలో గంజాయి సేవించే వారి యొక్క డేటా ను కలెక్ట్ చేసి వారిపై నిఘా పెట్టాలని పోలీస్ అధికారులకు సూచించడం జరిగిందన్నారు.

తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పై దృష్టి సారించాలని వారి యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కోరారు.

గంజాయి నివారణ గురించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని జిల్లాను గంజాయ్ రహిత జిల్లాగా మార్చాలని అధికారులను ఆదేశించారు.

గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు విక్రయాలు, రవాణాకు పాల్పడుతున్నట్లుగా ప్రజలకు సమాచారం అందితే డయల్100 కి లేదా మీ పరిధిలో ఉన్న పోలీస్ వారికి లేదా మెసేజ్ యువర్ ఎస్పీ ఫోన్ నెంబర్ 630-392-2572 సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 28, బుధవారం 2024