జిల్లా పోలీస్ శాఖ శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు సామాజిక కార్యక్రమాలు చేయడం అభినందనీయం.
TeluguStop.com
నిఘా నీడలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన వేములవాడ పట్టణం.దేవాదాయ శాఖ సహకారంతో 10 లక్షల రూపాయలతో 45 సీసీ కెమెరాల ఏర్పాటు.
శాంతి భద్రతల పర్యవేక్షణకు,నేరాల చెదనకు సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు స్వచ్చందంగా ముందుకు రావాలి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ దేవాదాయ శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన 45 సీసీ కెమెరాలను పోలీస్ అధికారులు,ప్రజాప్రతినిధులతో కలసి వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ప్రారంభించిన ప్రభుత్వ విప్, జిల్లా ఎస్పీ.
ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచినా శ్రీ రాజరాజేశ్వర దేవాలయానికి వివిధ ప్రాంతాల నుండి నిత్యం వందలాదిగా వచ్చే భక్తుల వేములవాడ పట్టణ ప్రజల భద్రత దృష్ట్యా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ సహకారంతో పట్టణ పరిధిలో 45 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం హర్షణీయం అన్నారు.
శాంతి భద్రతలు ఎక్కడైతే పటిష్టంగా ఉంటాయో అక్కడే అభివృద్ధి సాధ్యం అని, ప్రజల రక్షణ భద్రత గురించి పోలీసులు ఎల్లవేళలా పనిచేయడం జరుగుతుందన్నారు.
ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రంగా జీవించడానికి పోలీసు సేవలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయన్నారు.జిల్లా పోలీస్ శాఖ శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటుగా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడం అభినందనీయం అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా రాష్ట్రంలో పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగిందని,జిల్లా పోలీస్ శాఖ డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ డి- ఆడిక్షన్ సెంటర్ ఏర్పాటు, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
శాంతి భద్రతల పర్యవేక్షణకు, నేరాల చెదనకు సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు స్వచ్చందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాట కృషి చేయాలన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఉండటం వలన నేరస్తులు నేరం చేయడానికి ఒకటికి రెండు సార్లు అలోచిస్తారని, సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని, గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని, సీసీ కెమెరాల ద్వారా ఈ మధ్యకాలంలో చాలా కేసులు చేదించడం జరిగిందని తెలిపినారు.
కేసుల ఛేదన సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని తెలిపారు.గ్రామంలో రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రాచారి, టెంపుల్ ఈ.ఈ రాజేష్ , సి.
ఐ లు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్.ఐ లు మారుతి, అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి25, శనివారం 2025