పొత్తూరులో డ్రై డే కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా వైద్యాధికారి..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో డ్రై డే కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ఆకస్మికంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ ఇంటి చుట్టుపక్కల నీటి నిలువలు ఉండకుండా చూడాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తగు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ లింగం, వెంకట రమణ, సూపర్ వైజర్ నయీం, ఏ ఎన్ ఎం సుమతి, ఆశాలు , అంగన్ వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పేకలతో అత్యంత ఎత్తైన ఇల్లు కట్టిన అమెరికన్ ఆర్కిటెక్ట్.. ప్రపంచ రికార్డు బద్దలు..