నీట్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ఎమ్మెస్సార్ సెంట్రల్ స్కూల్లో జరుగుతున్న నీట్ పరీక్ష కేందాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.

వెంకట్రావు( S.Venkatarao ) ఆదివారం ఆకస్మికంగా సందర్శించిపరిశీలించారు.

విద్యార్థులకు సమకూర్చిన సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.జిల్లా కేంద్రంలో నీట్ పక్ష కొరకు సిటీ సెంట్రల్ స్కూల్, అంజలి స్కూల్,కాకతీయ హై స్కూల్( Kakatiya High School ) ,ఎమ్మెస్సార్ సెంట్రల్ స్కూల్ లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇందులో మొత్తం 918 మంది అభ్యర్థులకు గాను 10 మంది పరీక్షకు హాజరు కాలేదని 908 హాజరయ్యారని నీట్ డిస్టిక్ కోఆర్డినేటర్ ప్రభాకర్ కలెక్టర్ కు వివరించారు.

పరీక్ష కొరకు చేసిన ఏర్పాట్లను పరిశీలించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

స్టార్ యాంకర్ ఝాన్సీ కూతురిని చూశారా.. ఈమె కచ్చితంగా హీరోయిన్ అవుతుందంటూ?