ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా : మంగళవారం రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు( K.

Tarakaramarao ) జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం సాయంత్రం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయం, గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలోని పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించనున్నారు.

సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి హాజరై, మినీ స్టేడియంలో వాలీబాల్ అకాడమీని మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు.

ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

కార్యక్రమం సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాష్, యువజన, క్రీడా శాఖ అధికారి ఉపేందర్ రావు, ఎంపీడీఓ చిరంజీవి, తహశీల్దార్ జయంత్, తదితరులు పాల్గొన్నారు.

కేరళను కుదిపేసిన కారులో హీరోయిన్ పై లైంగిక దాడి…. ఎన్నెళ్ళయిన దొరకని న్యాయం