ఆ వర్గం నేతల దూరం .. కంగారులో కేసీఆర్ ?

మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ జెండా రెపరెపలాడించేందుకు అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల తాయిలాలు ప్రకటిస్తున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ ఇక్కడ విజయాన్ని నమోదు చేసుకోవడం ద్వారా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోను తమ పార్టీకి అధికారం దక్కబోతోంది అనే సంకేతాలను ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

అందుకే ఇప్పటికే పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఈ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టారు.

మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఈ నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించడంతోపాటు,  పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

ఎక్కడ ఎవరికీ ఎటువంటి అసంతృప్తి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయితే ఈ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న బీసీ సామాజిక వర్గం ఇప్పుడు టిఆర్ఎస్ కు దూరంగా జరిగిందనే సంకేతాలు కేసీఆర్ కు ఆందోళన కలిగిస్తున్నాయి.

ముఖ్యంగా పార్టీలోని బీసీ సామాజిక వర్గంలో కీలకంగా ఉన్న నాయకులు పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం, అలక చెందినట్లుగా వ్యవహరించడం తదితర అంశాలను కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు.

అదికాకుండా మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిత్వం కోసం బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు చాలామంది పోటీ పడుతున్నారు.

అయితే వీరిలో బలమైన సామాజిక వర్గం కు చెందిన వ్యక్తిని అభ్యర్థిగా నియమించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.

వీరిలో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా, మిగిలినవారు అసంతృప్తి చెందడంతో పాటు, పార్టీ కార్యక్రమాలు దూరం అవుతారనే టెన్షన్ కేసీఆర్ ను వెంటాడుతోంది.

  """/"/ అందుకే సర్వేల ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయాలని చూస్తున్నారు.అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు కేసీఆర్ రంగంలోకి దిగారు.

ముఖ్యంగా మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వంటి వారు తమను పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదంటూ అలక చెందడం తో పాటు,  బహిరంగంగానే పార్టీ నేతలు తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

అయితే మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం తాము నేతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెబుతున్నారు.మునుగోడు టిక్కెట్ ఆశిస్తున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతల లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే.

  బూర నరసయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్, నారబోయిన రవి, దూదిమెట్ల బాలరాజు యాదవ్ వంటి వారు ఈ టిక్కెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

కులాల ప్రాతిపదికన ఏ సామాజిక వర్గం వారు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారో గుర్తించి వారికి టిక్కెట్ ఇవ్వాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.

మిగతా ఆశావాహులు , అసంతృప్త నేతలతో ప్రత్యేకంగా భేటీ కావాలని కేసిఆర్ నిర్ణయించుకున్నారట.

 .

ప్రభాస్, బన్నీ, తారక్ సాధించారు.. చరణ్ గేమ్ ఛేంజర్ తో లెక్కలు తేలుస్తారా?