మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ తో చర్చ విఫలం

మరో నాలుగు రోజుల్లో ప్రభుత్వంతో కొనసాగింపు చర్చలు మంత్రి ఆధిములపు సురేష్.కార్మికుల సమస్యల పై చర్చించాం.

గత ప్రభుత్వాలు వారిని గాలికి వదిలేసాయి.వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు గణనీయంగా పెంచాం.

ముఖ్యమంత్రి కార్మికుల సమస్యల పై మానవీయ దృక్పధంతో వ్యవహరించారు.హెల్త్ కార్డులు.

మరణానంతరం వచ్చే బెన్ఫిట్స్ తో పాటు ఇరవై సమస్యలను మా ముందు ఉంచారు.

ప్రభుత్వం జరిపిన చర్చల పై కార్మికులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఇంకా సమస్యలు ఉంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి.

అన్ని విషయాలు వారికి వివరించి సంత్రుప్తికరంగా చర్చించాం.ప్రభుత్వ నిర్ణయం పై కార్మిక సంఘాలు అన్ని చర్చించుకుని తమ నిర్ణయం చెప్తాము అన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ఇప్పుడు జీతం పద్దెనిమిది వేలు ఇస్తున్నాం, అలవెన్స్ తో కలిపి ఇరవై ఒకటి వేలు ఇవ్వమని కోరుతున్నారు.

వాటితో పాటు ఇంకా ఇరవై సమస్యల పై చర్చించారు.ఎనభై శాతం వరకు జీతాలను ప్రభుత్వం పెంచింది.

అయినా ఇంకా పెంచాలని కోరడం సరికాదు.ప్రజలకు ఇబ్బంది లేకుండా పనుల్లోకి వెళ్ళాలి అని కార్మికులు లను కోరాం.

కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం.ఉమా మహేశ్వరావు.

మున్సిపల్ కార్మిక, ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్.ప్రధాన సమస్య అయిన జీతం ఇరవై ఒకటి వేల రూపాయలకు పెంచాలని చర్చల్లో మంత్రులను కోరాం.

దానికి మంత్రులు అంగీకరించలేదు.మిగిలిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

కానీ ప్రధాన సమస్య మాత్రం పరిస్కారానికి అంగీకరించలేదు.ఇరవై ఒకటి వేల రూపాయలు జీతం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది.

ఆ సమస్య పరిస్కారం అయ్యేంత వరకు పోరాటం కోనసాగిస్తాం.మున్సిపల్ కార్మికుల సమ్మెను యధాతధంగా కొనసాగిస్తాం.

మూవీ ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోను.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!