అమెరికాలో ఐదేళ్ళ పిల్లాడిపై లైంఘిక వేధింపుల కేసు...!

ఒక అమ్మాయి తో అబ్బాయి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నా లేక , ఒక టీచర్ స్కూల్ లోని పిల్లలతో అసభ్య ప్రవర్తన చేస్తూ ఉంటే ఆ పరిణామాలని లైంఘిక వేధింపుల క్రింద అభివర్ణిస్తారు.

మరి అభం శుభం తెలియని ఓ ఐదేళ్ళ పిల్లాడికి అసలు వ్యవహారమే తెలియదు, అలాంటి ముక్కు పచ్చలారని పిల్లాడిపై లైంఘిక కేసులు పెడితే ఎలా ఉంటుంది ఊహించండి.

అమెరికాలో ఇదే జరిగింది. """/"/అమెరికాలోని టెనస్సీ లో చట్టనూగ ప్రాంతంలో ఉన్న రిడ్జ్ ఎలిమెంటరీ స్కూల్ లో చదువుకుంటున్న ఐదేళ్ళ పిల్లాడిపై ఆ స్కూల్ యాజమాన్యం లైంఘిక వేధింపులు చేస్తున్నాడంటూ చైల్డ్ సర్వీసెస్ వారికి ఫిర్యాదు చేసింది.

ఆ పిల్లాడు తమ స్కూలు లో ఉన్న తోటి ఆడ పిల్లలకి ముద్దులు పెడుతున్నాడు.

కౌగిలించుకుంటున్నాడని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు చైల్డ్ వెల్ఫేర్ ప్రతినిధులు. """/"/దాంతో ఈ విషయం తెలుసుకున్న ఆ బుడతడి అమ్మమ్మ స్కూలు యాజమాన్యం పై మండిపడింది.

అసలు ఐదేళ్ళ పిల్లాడిపై ఇలాంటి ఫిర్యాదు ఎలా చేయాలని అనిపించింది అంటూ ఫైర్ అయ్యింది.

అంతేకాదు నా మనుమడు మూగవాడని, తనకి ఏదన్నా కావాలంటే అడిగే క్రమంలో అలా చేసి ఉంటాడని తెలిపింది.

పసి వాడిపై ఇలా మీరు ఫిర్యాదు చేస్తారా అంటూ తన మనవడికి జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా లో ప్రశ్నించగా ఆ స్కూల్ యాజమంయపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీ లో త్రప్తి డిమ్రి కి పెరుగుతున్న క్రేజ్…తన చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?