చిరంజీవి బాలయ్య మధ్య తేడా ఇదే.. డైరెక్టర్ బాబీ సంచలన వ్యాఖ్యలు వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోలు అయినా మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈ ఇద్దరూ స్టార్ సీనియర్ హీరోలు ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా బాలయ్య బాబు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నారు.ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఈ ఇద్దరు హీరోలతో కలిసి పని చేసిన ఒక దర్శకుడు తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న తేడాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
"""/" /
ఆ డైరెక్టర్ మరెవరో కాదు బాబి.మెగాస్టార్ తో వాల్తేర్ వీరయ్య( Waltair Veerayya ) సినిమా చేసి సక్సెస్ సాధించిన బాబీ కొల్లి రవీంద్ర( Bobby Kolli Ravindra ) ప్రస్తుతం బాలకృష్ణ తో డాకు మహారాజ్( Daku Maharaj ) తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది.అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ బాబీ బాలయ్యకు చిరుకు మధ్యన ఉన్న తేడా గురించి తెలిపారు.
మెగాస్టార్ చిరు కథ ఏమిటి అని ముందే అడుగుతారు.ఆయన సీన్ చేసే ముందు సీన్ పేపర్ చదువుతారు.
ఆయన అనుభవం ముందు మనమెంత.కానీ బాలకృష్ణ దర్శకుడిని నమ్మి సినిమాలు చేస్తారు.
"""/" /
బాలయ్య ఒకసారి కథ ఓకే చేశాక ఆయన దర్శకుడిని గుడ్డిగా నమ్ముతారు.
వేరే ఏది పట్టించుకోరు.దర్శకుడు ఏం చెబితే అది చేసుకుపోతారు.
బాలయ్య గారితో సినిమా చెయ్యడం నా అదృష్టం.ఇక్కడ పారితోషికాలు పక్కనపెడితే అభిమానులు కాలర్ ఎగరేసేలా సినిమా తియ్యాలనేది నా కోరిక, అందుకు తగిన విధంగానే అభిమానులు మెచ్చేలానే డాకు మహారాజ్ చేస్తున్నట్టుగా బాబీ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ బాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాలిఫోర్నియాలో జంతువుల దాడి.. భయంతో వణికిపోతున్న ప్రజలకు ఊహించని ట్విస్ట్..