తిరుమల తరహా మరో ప్రముఖ దేవాలయం అభివృద్ధి.. ఎక్కడంటే..
TeluguStop.com
కలియుగ వైకుంఠం అని, ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అని తిరుమల( Tirumala ) పుణ్యక్షేత్రానికి పేరు.
రోజు ఈ పుణ్యక్షేత్రానికి వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు.
అంతే కాకుండా మరి కొంత మంది భక్తులు తలనీలాలను సమర్పిస్తూ ఉంటారు.భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తూ ఉంటారు.
పండుగలు, బ్రహ్మోత్సవాలు, వారాంతపు సెలవులలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య లక్షలలో ఉంటుంది.
అయినప్పటికీ ఏ ఒక్క భక్తుడు కూడా స్వామివారిని దర్శించుకోకుండా వెనక్కి వెళ్ళని విధంగా అక్కడి వసతులను అభివృద్ధి చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)అధికారులు.
తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అక్కడ మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నారు.
భక్తులకు నివాస వసతి, అన్న ప్రసాద వితరణ, క్యూలైన్లు తిరుమల వీధుల నిర్మాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది.
"""/" /
ఇప్పుడు అలాంటి వసతులనే నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం(Srisailam Devasthanam)లో కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రచించింది.శనివారమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ( Dr.
KS Jawahar Reddy)మాస్టర్ ప్లాన్ పై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం.దేవాదయ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాలయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, శ్రీశైలం దేవాలయ కార్య నిర్వహణ అధికారి లవన్న, దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
"""/" /
ద్రోణ కన్సల్టెన్సీ, క్రియేటివ్ కన్సల్టెన్సీ సంస్థలు ఈ మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నట్లు సమాచారం.
వచ్చే 30 ఏళ్లలో అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ రూపొందించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
భక్తులకు సౌకర్యాల కల్పన, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
పెళ్లి కూతురు ముందే వరుడి చెవిలో గుసగుసలాడిన ఫ్రెండ్.. చివరకు?